Folk Song: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఈశ్వర్ సాయి కొత్త సాంగ్.. ‘బావో మల్లారెడ్డి’ పాట విన్నారా?

Published : Nov 16, 2026, 02:30 PM IST

Folk Song: తెలంగాణ జానపద పాటలకు యూట్యూబ్‌లో రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది. కొత్త పాట వచ్చిందంటే చాలు.. యువత రీల్స్‌తో హోరెత్తిస్తున్నారు. అలా ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది ఈశ్వర్ సాయి చేసిన బావో మల్లారెడ్డి సాంగ్. ఆ పాట విశేషాలు చూద్దాం.

PREV
14
బావో మల్లారెడ్డి ఫోక్ సాంగ్

జానపద పాటలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా పల్లెటూరి యాస, అచ్చమైన తెలంగాణ పదాలు, అదిరిపోయే మ్యూజిక్, ఆకట్టుకునే డ్యాన్స్ స్టెప్పులతో రూపొందే ఫోక్ సాంగ్స్‌కు యూట్యూబ్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఒకప్పుడు జానపద పాటలు అంటే కేవలం పల్లెల్లోనే వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అలాంటి పాటల్లో ఒకటే ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి సాంగ్ ‘బావో మల్లారెడ్డి’. ఈ పాట పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

24
ఎనర్జిటిక్ డ్యాన్స్

ఈశ్వర్ సాయి పేరు చెప్పగానే చాలామందికి ఆయన వేసే ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ గుర్తుకొస్తాయి. జానపద పాటలకు తనదైన శైలిలో హావభావాలు పలికిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఈశ్వర్ సాయి. ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్‌లో కనిపించే పల్లెటూరి వాతావరణానికి అనుగుణంగా ఆయన చేసే డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా ‘బావో మల్లారెడ్డి’ పాటతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈశ్వర్ సాయి.

34
ఆకట్టుకుంటున్న సాంగ్

“ఆ సీటీ సీర తెత్తా.. నీకు సిగల పూలు తెత్తా.. శిలకట్ల కాడే కలువే ఓ చిలుక ముక్కు దాన” అంటూ సాగే ఈ పాట ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. సాధారణంగా జానపద పాటల్లో అందమైన పదాలతో ప్రేమను, సరదాను, చిలిపితనాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఈ పాటలోనూ అలాంటి జానపద శైలి కనిపిస్తుంది. ఫోక్ సాంగ్స్‌ను ఇష్టపడేవారికి ఈ పాట మంచి వినోదాన్ని అందిస్తుంది.

44
బావో మల్లారెడ్డి పాటతో మరోసారి..

ఈ పాటలో ఈశ్వర్ సాయికి జోడీగా రిధి కనిపించారు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ పాటను కిస్రా మ్యూజిక్ (Kisra Music) విడుదల చేసింది. సింగర్స్ నరసింహులు, ఉష ఈ పాటను పాడారు. ఇప్పటికే ఈశ్వర్ సాయి చేసిన ‘బాసింగా బలాలే’, ‘సన్న సన్న బియ్యమే’, ‘సీటీ చీర’, ‘రాతిరి రాతిరి రాతిరిలో’ వంటి పాటలు ఫోక్ మ్యూజిక్ అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘బాసింగా బలాలే’ పాట భారీ స్థాయిలో వ్యూస్ సాధించి ఆయన క్రేజ్‌ను మరింత పెంచింది. ఇప్పుడు ‘బావో మల్లారెడ్డి’ పాటతోనూ అదే తరహా జానపద వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు ఈశ్వర్ సాయి.

Read more Photos on
click me!

Recommended Stories