పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా వరుసగా వార్తల్లో నిలుస్తోంది. మీరా చోప్రా తరచుగా సోషల్ మీడియాలో ఇండియాలో హైలైట్ అవుతున్న పొలిటికల్ టాపిక్స్ పై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది.
మీరా చోప్రా ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలబడలేకపోయింది. అయితే తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇప్పటికి మీరా చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. నాలుగు పదుల వయసు వచ్చినా మీరా చోప్రా ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు.
ఎట్టకేలకు మీరా చోప్రా తనకు కాబోయే భర్తని వెతుక్కుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తన ప్రియుడే. మూడేళ్ళుగా వీరిద్దరి లవ్ లో ఉన్నారట. మార్చి 12న మీరా చోప్రా వివాహం జరగనుంది. పెళ్లి వేడుక దగ్గర పడుతుండడంతో మీరా చోప్రా కాబోయే భర్త వివరాలు బయటకి వస్తున్నాయి.
అతడి పేరు రక్షిత్ కేజ్రీవాల్. సినిమారంగంతో సంబంధం లేని వ్యక్తి. ముంబైలో బిజినెస్ లో రాణిస్తున్నాడు. మీరా చోప్రా, రక్షిత్ మధ్య మూడేళ్ళుగా సీక్రెట్ ఎఫైర్ సాగుతోంది. వీళ్లిద్దరి వివాహ వేడుక జైపూర్ లోని బ్యున విస్తా లగ్జరీ గార్డెన్స్ అనే రిసార్ట్ లో జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే వివాహ వేడుకకు రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేశారట.
మొత్తం 150 మంది గెస్ట్ లని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. మీరా చోప్రా, రక్షిత్ వెడ్డింగ్ కార్డులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వెడ్డింగ్ కార్డుపై మీరా, రక్షిత్ లోని మొదటి రెండు ఆంగ్ల అక్షరాలు కలిసేలా 'MERA' అని ముద్రించారు.
మార్చి 11 వ తేదీన పెళ్లి వేడుకలు మొదలవుతాయి. హల్దీ, కాక్ టైల్ పార్టీ, సంగీత్ ఇలా వైభవంగా మీరా చోప్రా వెడ్డింగ్ జరగనుంది. ప్రస్తుతం మీరా చోప్రా వెడ్డింగ్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.