Bandla Ganesh: పెద్దమనిషి చేతిలో చెప్పుదెబ్బలు, భార్య ముందు కన్నీళ్లు.. బండ్ల గణేష్‌ జీవితాన్నే మార్చేసిన సంఘటన

Published : May 26, 2026, 11:15 AM IST

నిర్మాత బండ్ల గణేష్‌ తన జీవితంలోని కష్టాలు, అవమానాలను బయటపెట్టాడు. ఓ పెద్దమనిషి చేతిలో చెప్పు దెబ్బలు తిన్న సంఘటన కూడా బయటపెట్టాడు. అదే తన జీవితాన్ని మార్చేసిందట. 

PREV
15
బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్‌

బండ్ల గణేష్‌.. టాలీవుడ్‌లో స్టార్‌ ప్రొడ్యూసర్‌, వ్యాపారవేత్త. రాజకీయ నాయకుడు కూడా. రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. పార్టీ పరంగా పెద్దగా ప్రోత్సాహం లేకపోవడంతో సైలెంట్‌ అయ్యారు. కానీ సైలెంట్‌గానే రాజకీయాలను శాసించే స్థాయిలో ఆయన ఉన్నారు. ఇండస్ట్రీలో ఒక బిగ్‌ షాట్‌ అనే చెప్పొచ్చు. నటుడిగా, నిర్మాతగా సక్సెస్‌ అయిన బండ్ల గణేష్‌ నిర్మాతగా కమ్‌ బ్యాక్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

25
ఇంటర్‌ మధ్యలోనే వదిలేసిన బండ్ల గణేష్‌

ఈ క్రమంలో బండ్ల గణేష్‌ తన జీవితంలోని స్ట్రగుల్స్ ని పంచుకున్నారు. తాను ఎదుర్కొన్న అవమానాలను బయటపెట్టాడు. అదే సమయంలో భార్య ముందు కన్నీళ్లు పెట్టుకున్న సందర్బాలను బయటపెట్టాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనని చాలా మంది అవమానించారట. వేషాల కోసం తిరిగే సమయంలో వెళ్లి కోడి గుడ్ల వ్యాపారం చేసుకోవాలని, కోడి గిన్నెల కడుక్కో పో అని చాలా మంది అవమానించారట. ఇంటర్మీడియట్‌ మధ్యలోనే హైదరాబాద్‌కి వచ్చాడట బండ్ల గణేష్‌. అవకాశాల కోసం తిరుగుతుంటే కొందరు ఇంటికెళ్లిపోరా అంటూ సలహాలిచ్చారట. తనతోనే చెప్పడం కాకుండా, తన అమ్మా నాన్నలకు కూడా కూడా చెప్పేవారట. దీంతో వాళ్లు చాలా బాధపడేవారట.

35
బండ్ల గణేష్‌ ఏడ్చిన రోజులు

ఈ సందర్భంగా తాను ఇంటికెళ్లి భార్య వద్ద ఏడ్చిన సందర్భాలను బండ్ల గణేష్‌ పంచుకున్నారు. తనకు 1999లో పెళ్లి అయ్యిందట. తనకు భార్య అంటే చాలా ఇష్టమని, ఆమెని సరదాగా బయటకు తీసుకెళ్లాలని, ఆనందంగా గడపాలని ఉండేదట. కానీ సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌లో నిర్మాతల ఇళ్ల చుట్టూ తిరిగేవాడట. దీంతో ఇంటికి వెళ్లే సరికి రాత్రి 12 అయ్యేదని తెలిపారు బండ్ల గణేష్‌. తన భార్యతో ఆనందంగా గడపాలని ఉండేదని, కానీ తన కోసం అన్నీ త్యాగం చేసిందని, ఆయా పరిస్థితులను తలచుకొని చాలా ఏడ్చేవాడిని అని చెప్పాడు. అలాంటి సమయంలోనే ఇండస్ట్రీలో కొందరు చాలా నీచంగా మాట్లాడేవారు, అలాంటి వారిచేత అవమానాలు, అసహ్యాలు ఎదుర్కోవడం వల్లే తనకు ఎలాంటి బ్యాడ్‌ హ్యాబిట్స్ లేవని తెలిపారు బండ్ల గణేష్‌. ఇలాంటి వారిని ఫేస్‌ చేయడం వల్లే తాను ఈస్థాయిలో ఉన్నానని, చాలా మంది కంటే బెటర్‌గా లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నానని తెలిపారు గణేష్‌.

45
బండ్ల గణేష్‌ని చాలా రోజులు బాధపెట్టిన సంఘటన

ఈ సందర్భంగా తాను చాలా రోజులు బాధ పడ్డ సంఘటన పంచుకున్నాడు బండ్ల గణేష్‌. తనకు పెళ్లైన కొత్తలో మారుతి కారు ఉండేదట. ఓ రోజు భార్యతో కలిసి బయటకు వెళ్దామని రెడీ అవుతున్నారట. కారు తెచ్చి ఇంటి కింద పెట్టాడట. ఆ సమయంలో ఓ అపార్ట్ మెంట్‌లో రెంట్ కి ఉంటున్నాడట. పైకి వెళ్లి కిందకు వచ్చేసరికి కారు లేదు. ఏమైందని భయం. తీరా ఆరా తీస్తే ఫైనాన్స్ కట్టలేదని, చెక్‌ బౌన్స్ అయ్యిందని ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారట.ఆ సమయంలో తన అన్నకి పోన్‌ చేస్తే ఆయన డబ్బు అరెంజ్‌ చేశారట. తన జీవితంలో మొదటిసారి ఆయన అన్నని డబ్బులు అడిగాడట. అయితే కారులో భార్యతో కలిసి బయటకు వెళ్లాలనుకుంటే కారు లేకపోవడంతో చాలా ఇన్‌సల్ట్ గా ఫీలయినట్టు తెలిపారు గణేష్‌. అది తనని చాలా రోజులు బాధపెట్టిందన్నారు.

55
బండ్ల గణేష్‌ జీవితాన్నే మార్చేసిన చెప్పుదెబ్బ

ఇక ఓ పెద్ద మనిషి తనని చెప్పుతో కొట్టిన సందర్భాన్ని బయటపెట్టారు. ఓ పెద్ద మనిషి ఇంటికెళ్లి కూర్చున్నాడట గణేష్‌. అది సౌందర్య చనిపోయిన రోజు. తనకు ఏం పనిలేకపోవడంతో ఊరికే వెళ్లి ఆయన ఇంట్లో కూర్చున్నాడట. చూసి చూసి ఆ పెద్ద మనిషి తనని చెప్పుతో కొట్టాడట. ఏదో టెన్షన్‌లో ఉన్నాడట. అదే సమయంలో తాను సర్‌ సర్‌ అనడంతో చెప్పుతో కొట్టాడట. కానీ ఆ తర్వాత ఆయన కూడా ఆ సంఘటనపై బాధపడ్డాడట. సారీ కూడా చెప్పాడట. కానీ ఆ సంఘటన తన జీవితాన్నే మార్చేసింది. అద్భుతమైన టర్న్ తీసుకుందని, ఆ తర్వాత ఆయన తనకు సహాయం కూడా చేశాడని తెలిపాడు గణేష్‌. మనకు కోపం వస్తే పనికి రాని వస్తువులను పగలగొడతాంం. వాటి విలువ తక్కువ అని, ఆ రోజు తనకు అలాంటి అవమానమే జరిగిందని, ఆ రోజు ఆయన పక్కన ఉన్న వ్యక్తికి ఒక విషయం చెప్పాడట గణేష్‌. ఇప్పుడు తన వద్ద డబ్బు లేదనేగా చెప్పుతో కొట్టాడు, ఏదో రోజు ఈయన్ని మించి ఎదుగుతానని ఛాలెంజ్‌ చేశాడట. చేయడమే కాదు నిరూపించాడట. ఇప్పుడు ఆయనకంటే మంచి స్థానంలో ఉన్నట్టు తెలిపారు గణేష్‌. అదే తన అఛీవ్‌మెంట్ అని చెప్పాడు. రాజా రవీంద్రతో టాక్‌ షోలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories