విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ప్రియా వారియర్.. సింపుల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న మలయాళీ బ్యూటీ

First Published | Jul 16, 2023, 4:31 PM IST

కన్ను గీటు వీడియోతో ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో దక్షిణాది చిత్రాలతో పాటు నార్త్ సినిమాల్లోనూ అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో సంది చేస్తోంది. 
 

మలయాళీ యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. రెండు చిత్రాల్లోనే నటించినా మంచి క్రేజ్ దక్కించుకుంది.  తెలుగుతో పాటు ఆయా భాషల్లో అవకాశాలు సొంతం చేసుకుంది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ  చేతిలో చాలానే సినిమాలున్నాయి. ఆ మూవీ అన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ వస్తోంది. 
 


ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ వేకేషన్ లో ఉంది.  బ్యాంకాక్ లో స్నేహితులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను పంచుకుంది. 
 

వెకేషన్ లో ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. బ్యాంకాక్ లోని వీధులన్నీ తిరుగుతూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఫొటోలకు ఫోజులిస్తూ అట్రాక్ట్ చేసింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేస్తోంది. 
 

ఇక ప్రియా వారియర్ నటించిన  మలయాళ చిత్రం  తెలుగులో ‘లవర్స్’గా విడుదలైన తర్వాత ఇక్కడి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. వరుస చిత్రాలతో అలరించబోతోంది. 
 

ఇదిలా ఉంటే తెలుగులో ప్రియా వారియర్ తెలుగులో ‘చెక్’, ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’లో నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - సాయిధరమ్ తేజ్ నటించిన ’బ్రో : ది అవతార్’తో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాతోనైనా హిట్ కొడుతుందా చూడాలి. ఈ నెలలో విడుదల కాబోతోంది. 
 

Latest Videos

click me!