బాలకృష్ణ తన భార్యతో ఏ విషయంలో తిట్లు తింటాడో తెలుసా? బాలయ్య చెప్పిన టాప్ సీక్రెట్?

Published : Feb 04, 2026, 08:16 AM IST

నటసింహం బాలకృష్ణ అంటే... చాలామంది భయపడతారు. ఆయనతో మాట్లాడాలంటే ఆలోచిస్తుంటారు. క్రమశిక్షణకు మారుపేరైన బాలయ్య..ఓ విషయంలో మాత్రం తన భార్యతో తిట్లు తింటుటారట. ఆయనే స్వయంగా చెప్పిన ఆ విషయం ఏంటంటే?

PREV
14
బాలకృష్ణ క్రమశిక్షణ..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంత క్రమశిక్షణతో ఉండేవారో... ఆయన నట వారసుడిగా బాలయ్య కూడా అదే క్రమశిక్షణను ఫాలో అవుతున్నాడు. సినిమాల విషయంలో కానీ.. పర్సనల్ లైఫ్ విషయంలో కానీ.. బాలయ్య కొన్ని నియమాలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. 

ఉదయం 4 గంటలకే పూజ, షూటింగ్ కు టైమ్ కంటే ముందే స్పాట్ లో ఉండటం లాంటివి బాలయ్య నుంచి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు. అంతే కాదు దర్శకుడు ఎంత చిన్నవాడైనా.. కొత్తవాడైనా సరే.. అతను చెప్పింది చెప్పినట్టు చేసి.. రీ టేక్ చేయాలన్నా సరే.. దర్శకుడి మాటలకు గౌవరం ఇచ్చి చేస్తుంటాడు బాలకృష్ణ. డైరెక్టర్ డ్యూటీలో ఎప్పుడు వేలు పెట్టరు నటసింహం.

24
భార్యతో బాలయ్య తిట్లుతినే విషయం ఏంటంటే?

సినిమా అంటే.. ఓ యజ్ఞంలా చేస్తారు బాలయ్య.. టీమ్ అందరితో సరదాగా ఉంటారు. సెట్ లో ఎంతో సందడి చేస్తారు. అయితే బాలకృష్ణకు ఉన్న మరో అలవాటు ఏంటంటే.. ? ఎక్కడ షూటింగ్ జరిగినా.. ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటారు. ఈ విషయంలో తన భార్య వసుందర చాలా సార్లు తనను తింటిందని బాలయ్య ఓ సందర్భంలో వెల్లడించారు. బయట షూటింగ్స్ కు వెళ్లిన్నప్పుడు ఎలాగూ తప్పదు.. హైదరాబాద్ లో షూటింగ్ జరిగినా కూడా.. ఇంటి నుంచి క్యారియర్ పంపిస్తా అంటే ఎందుకు వద్దంటారు అని.. బాలయ్య భార్య తిడుతుంటారట.

34
ప్రొడక్షన్ ఫుడ్ పై బాలకృష్ణ కామెంట్స్..

ఎవరు ఏమన్నా కానీ నందమూరి హీరో మాత్రం ఎక్కడ షూటింగ్ జరిగినా ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తినడానికి ఇష్టపడుతుంటారు. డాకూ మహరాజ్ సినిమా ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. '' మనకు అన్నం పెట్టేది సినిమా.. నేను నా ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా కానీ.. ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటాను. ఈ విషయంలో నా భార్య నన్ను తిడుతుంది. ఇంటిపక్కనే కదా షూటింగ్.. ఇంట్లో వండి పంపిస్తాను.. హైజనిక్ కదా అంటుంది. ఏంటి హైజనిక్.. ఇండస్ట్రీ మనకు ఫుడ్డు పెడుతుంది. నేను ఇప్పుడు ఇంత హుషారుగా ఉన్నాను, కుర్రాడిలా ఉన్నానంటే.. ఇండస్ట్రీ ఫుడ్డు తినే'' అని అన్నారు.

44
దూసుకుపోతున్న సీనియర్ హీరో...

ఇక బాలయ్య విషయానికి వస్తే.. 65 ఏళ్ల వయసులో కూడా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. అఖండ సినిమా నుంచి ఆయన ఏ సినిమా చేసినా..అది సక్సెస్ అవుతోంది. రీసెంట్ గా అఖండ 2తో యావరేజ్ రిజెల్ట్ ను సాధించిన నటసింహం.. నెక్ట్స్ మలినేని గోపీచంద్ తో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

Read more Photos on
click me!

Recommended Stories