OTT Film: డైరెక్ట్ ఓటీటీలో ఆనంద్‌ దేవరకొండ మూవీ.. `తక్షకుడు` టీజర్‌ ఎలా ఉందంటే?

Published : Feb 03, 2026, 11:08 PM IST

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `తక్షకుడు`. ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఇంటెన్స్ తో  యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా సాగే టీజర్‌ ఆకట్టుకుంది. ఆనంద్‌లోని మరో యాంగిల్‌ని చూడొచ్చు.   

PREV
14
తక్షకుడుతో రాబోతున్న ఆనంద్‌ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ `బేబీ` మూవీ తర్వాత చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు. ఆ తర్వాత దాన్ని బీట్‌ చేసే స్థాయిలో మూవీస్‌ లేకపోవడంతో బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన చాలా సెలక్టీవ్‌గా వస్తున్నారు. కాన్సెప్ట్ ఉన్న చిత్రాలే చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `తక్షకుడు` అనే చిత్రంలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగవంశీ దీన్ని నిర్మించారు. వినోద్‌ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండకి జోడీగా నితాషి గోయల్‌ హీరోయిన్‌గా చేస్తుంది.

24
తక్షకుడు మూవీ టీజర్‌

`తక్షకుడు` మూవీ టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిందని అర్థమవుతుంది. టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఎంగేజ్‌ చేసేలా సాగింది. కట్టిపడేసింది. ఇందులో ఆనంద్‌ దేవరకొండని మరో యాంగిల్‌లో చూడొచ్చు. అర్థరాత్రి ఓ చెరువు దగ్గర నుంచి పడిపోయిన ఆనంద్‌ దేవరకొండని అక్కడి ప్రజలు ఎత్తుకొని వెళ్తారు. ఓ ఇంట్లో ఉంచి ఆయనకు వైద్యం చేస్తారు. కొన్నాళ్లకి కోలుకుంటాడు. తాను ఎక్కడ ఉన్నానో ఆయనకు అర్థం కాదు, కళ్లు కనిపించవు, దీంతో ఆయోమయంలో ఉంటాడు. కానీ కుక్క మాత్రం తన వెంటే ఉంటుంది.

34
ఆనంద్‌ దేవరకొండలోని కొత్త యాంగిల్‌

అయితే ఆనంద్‌ చేతిలో ఓ బిల్ల ఉంటుంది. అది తనకు కావాల్సిన వాడిది. తాను వెతుకున్న వాడిది. ఇది తన వద్ద ఉందంటే అతను కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నాడని భావిస్తాడు. అతని కోసం వెతుకుతుంటాడు. లేవలేని స్థితిలో ఆనంద్‌ స్ట్రగుల్‌ అవుతాడు.  అతనిపై పగ తీర్చుకోవడం కోసం తపిస్తుంటాడు. ఇంతలో హీరోయిన్‌ని చూపించారు. ఆమె పెళ్లికి రెడీగా ఉంటుంది. మరి ఆ అమ్మాయితో ఆనంద్‌ దేవరకొండ లవ్‌ స్టోరీ ఏంటి? ఎందుకు తన జీవితం క్రైమ్‌లోకి వచ్చింది. అసలేం జరిగిందనేది సినిమాగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రేమ కోసం ప్రతీకారం అనేలా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. టీజర్‌ మాత్రం కట్టిపడేసింది. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఎంగేజ్‌ చేసింది. ఇందులో ఆనంద్‌ దేవరకొండ కొత్త లుక్‌లో ఉన్నాడు. ఊరమాస్‌గా, డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. నటన పరంగా ఇరగదీశాడు. ఆయన పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్, గెటప్స్ ఉన్నాయి. 

44
డైరెక్ట్ ఓటీటీలోకి `తక్షకుడు`

`తక్షకుడు` టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ కట్టిపడేసింది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇది తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్ కాబోతుంది. అయితే ఇది థియేటర్లోకి రావడం లేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్‌ కానుంది. నెట్‌ ఫ్లిక్స్ లో రిలీజ్‌ చేస్తున్నారు. ఆనంద్‌ దేవరకొండ మూవీ ఇలా డైరెక్ట్ ఓటీటీలోకి రావడం గమనార్హం. చూడబోతుంటే ఇది థియేట్రికల్‌కి సెట్‌ అయ్యే మూవీలా ఉంది. మరి నిర్మాత నాగవంశీ ఏం చేయబోతున్నారో చూడాలి. కానీ  టీజర్‌లో మాత్రం ఇది ఓటీటీ ఫిల్మ్ అని ప్రకటించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories