ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో `NBK107` సంచలనం.. వామ్మో బాలయ్య ఈ రేంజ్‌లోనా?.. మెగాస్టార్‌ కి బిగ్‌ షాక్‌..

First Published | Sep 24, 2022, 7:37 PM IST

బాలయ్య జోరు మీదున్నాడు. `అఖండ` సంచలన విజయంతో ఆయన దూకుడు మీదున్నాడు. నెక్ట్స్‌ సినిమా బిజినెస్‌లో ఆయన తన రేంజ్‌ని చాటుకుంటున్నాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు షాకిస్తున్నాయి. 

బాలకృష్ణ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని `అఖండ` సినిమాతో అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 150కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల టాక్‌. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ గా నిలిచింది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌ లో హ్యాట్రిక్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఆయన నటించే తదుపరి సినిమాల విషయంలో భారీ అంచనాలున్నాయి. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య `ఎన్బీకే 107` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

బాలయ్య నటిస్తున్న 107వ సినిమాకి ఇంకా టైటిల్‌ని కన్ఫమ్‌ చేయలేదు. దసరాకి టైటిల్‌, టీజర్‌ విడుదలయ్యే అవకాశం ఉందట. ఇందులో శృతి హాసన్‌ నటిస్తుండగా, మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా ప్రస్తుతం ఫారెన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇస్తాంబుల్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్నట్టు సమాచారం. 
 


ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారీగా పలుకుతున్నట్టు సమాచారం. బయ్యర్లు భారీగా ఆఫర్‌ చేస్తున్నారు. మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయట. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్‌ లెక్కలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 
 

బాలయ్య `ఎన్బీకే 107` చిత్రం థియేట్రికల్‌ రైట్స్ కోసం రూ. 75కోట్లు ఆఫర్‌ చేస్తున్నారట బయ్యార్లు. ఇందులో నైజాం 20కోట్లు, సీడెడ్‌ 20కోట్లు ఉన్నట్టు టాక్‌. మిగిలిన్‌ ఏపీ మొత్తం కలుపుకుని 75 కోట్ల వరకు ఆఫర్‌ వచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్‌ అవుతుంది. మరోవైపు డిజిటల్‌ రైట్స్(శాటిలైట్‌,ఓటీటీ రైట్స్) లోనూ బిజినెస్‌ షాకిస్తుంది. డిజిటల్‌ రైట్స్ కోసం ఏకంగా రూ.60కోట్ల ఆఫర్ వచ్చిందట. ఈ లెక్కన ఈ సినిమాకి ఓవరాల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.135కోట్లు అని చెప్పొచ్చు. ఇది బడ్జెట్‌ కంటే డబుల్‌ కావడం విశేషం. 
 

బాలయ్య ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ మెగాస్టార్‌ కి షాకిస్తుంది. చిరు నటించిన `గాడ్‌ ఫాదర్‌` చిత్రం రూ.110కోట్ల బిజినెస్‌ జరిగిందట. `ఆచార్య` ఫెయిల్‌ అయినా ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరగడం విశేషం. దాన్ని మించి బాలయ్య దూసుకుపోతున్నారు. `ఎన్బీకే107` మెగాస్టార్‌ కే షాకిస్తున్నారని చెప్పొచ్చు. మరి ఇది సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న వార్త. నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!