బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, మంచు లక్ష్మి, స్మితా యోగా ఫోజులు.. ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్స్ యోగాసనాలు..

Published : Jun 21, 2022, 02:41 PM ISTUpdated : Jun 21, 2022, 02:44 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా టాలీవుడ్ స్టార్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పలు కఠినమైన యోగాసనాలతో ఆకట్టుకున్నారు. యోగా ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేశారు. వారి పిక్స్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

PREV
16
బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, మంచు లక్ష్మి, స్మితా యోగా ఫోజులు.. ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్స్ యోగాసనాలు..

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 (International Yoga Day 2022) ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం మే27న యెగా ఉత్సవ్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మే 21 (ఈ రోజు) వరకు కొనసాగించారు. అయితే యోగా దినోత్సవంలో టాలీవుడ్ స్టార్స్ కూడా భాగస్వాములయ్యారు. 
 

26

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్ నందమూరి బాలక‌ృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత యోగా గొప్పతనాన్ని బాలకృష్ణ వివరించారు. యోగాభ్యాసం మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని, నియమం తప్పకుండా రోజూ అభ్యాసం చేయాలన్నారు.
 

36

టాలీవుడ్ యంగ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కూడా ఇంటర్నేషనల్ యోగా డేలో భాగస్వామ్యమైంది. ఈ సందర్భంగా యోగా ఫోజులో కూడిన ఓ పిక్ ను అభిమానులతో పుంచుకుంటూ అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలిపింది. యోగా స్ఫూర్తిని నింపేందుకు తనవంతు ప్రయత్నం చేసిందీ బ్యూటీ.

46

నటి మంచు లక్ష్మి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కఠిన యోగాసనాలతో ఆకట్టుకుంది. శీర్షాసనం, పద్మాసనాలతో యోగా స్ఫూర్తిని నింపింది. తన యోగాసనాలకు సంబంధించిన ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటూ యోగా డే శుభాకాంక్షలు తెలిపింది.   

56

ప్రముఖ లేడీ సింగర్ స్మితా కూడా యోగా డే సందర్భంగా ‘టీ’ ఆకారంలో ఆసనం వేసింది. ఇందుకు సంబంధించిన పిక్ ను ఇంటర్నెట్ లో తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా  యోగా దినోత్సవ శుబాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
 

66

టాలీవుడ్ అందాల రాక్షసి, యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి  (Lavanya Tripathi) హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్ ప్రారంభం రోజే పాల్గొంది. ఈ సందర్భంగా పలు యోగాసనాలతో ఆకట్టుకుంది. యోగా డేను ప్రాముఖ్యతను తెలిపేలా ఇలా ఆసనాలు వేసింది.

click me!

Recommended Stories