జూబ్లీహిల్స్‌లోని బాలయ్య ఇంటి విలువ రూ.50 కోట్లు. అలాగే ఆయనకు భూములు, ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. రామకృష్ణ స్టూడియో, ఎన్టీఆర్ స్టూడియోలో భాగస్వామ్యం ఉంది. అలాగే ఆయన దగ్గర ఆరు కిలోల బంగారం, 156 కిలోల వెండి, 580 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయట. BMW 7 సిరీస్ కార్లు, బెంజ్ వంటి కార్లు ఉన్నాయి.
ఇలా టాలీవుడ్‌లో బిగ్ షాట్‌లో ఒకరిగా రాణిస్తున్నారు బాలయ్య. బాలయ్య ఆస్తులు వంద కోట్ల వరకు ఉంటాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల్లో తెలిపారు. కానీ అంతకంటే ఎక్కువే ఉంటుందని, వందల కోట్లు ఉంటాయని సమాచారం. (ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మాత్రమే)