unstoppable with nbk show promo
రష్మిక మందన్నా ప్రస్తుతం హిందీలో `యానిమల్` చిత్రంలో నటిస్తుంది. ఛాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ హీరోగా `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. డిసెంబర్ 1న మూవీ విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా యూనిట్ హైదరాబాద్‌లో సందడి చేసింది. అందులో భాగంగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` సీజన్ 3 షోకి వచ్చారు. ఇందులో రష్మిక మందన్నాతోపాటు రణ్ బీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు.
unstoppable with nbk show promo
ఇందులో రష్మికకి బాలయ్య లవ్ ప్రపోజ్ చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు విజయ్ దేవరకొండకి వార్నింగ్ ఇవ్వడం కూడా మరింత హాట్ టాపిక్ అవుతుంది. ముందుగా షోకి సందీప్ రెడ్డి వంగా వచ్చారు. ఆయన్ని ఫేవరేట్ డైరెక్టర్స్ అంటూ ఇరకాటంలో పెట్టారు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌కి వెల్‌కమ్ చెప్పారు. అనంతరం గులాబీ పువ్వు పట్టుకుని, తాను ఆగలేకపోతున్నానని, రష్మికని పిలిచేశాడు బాలయ్య. అంతేకాదు ఆమె చేయిన పట్టుకుని రింగులు తిప్పుతూ, బాంబ్ పేల్చాడు. రష్మిక మెలికలు తిరుగుతుంటే, నా గుండె మెలికలు తిరిగిపోతుందంటూ పోప్ వేశాడు.
unstoppable with nbk show promo
అంతేకాదు రష్మిక మందన్నాకి రోజా పువ్వు ఇచ్చి ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ప్రస్తావన వచ్చింది. `అర్జున్‌రెడ్డి`, `యానిమల్` చిత్రాల పోస్టర్లు చూపిస్తూ ఈ ఇద్దరిలో ఎవరు బాగున్నారని రష్మికని ఇరికించే ప్రశ్న అడిగారు బాలయ్య. దానికి రణ్ బీర్ కపూర్ కూడా రెచ్చగొట్టే కామెంట్ చేశాడు. దీంతో రష్మిక మరింతగా ఇబ్బంది పడ్డింది.
unstoppable with nbk show promo
అంతేకాదు లైవ్‌లో విజయ్ తో ఫోన్‌లో మాట్లాడించారు బాలయ్య. రష్మిక మాట్లాడుతూ వాట్సాప్ రే అంటూ మాట్లాడటంతో బాలయ్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కేక అనిపించాయి. ఈ మేడ మీద పార్టీలేంటన్నా అంటూ బాలయ్య అనడం హౌజ్ మొత్తం హోరెత్తిపోయింది. రష్మిక సైతం సిగ్గులతో ముగ్గేసింది.
unstoppable with nbk show promo
ఆ తర్వాత సందీప్ రెడ్డి విజయ్‌తో మాట్లాడుతుండగా దగ్గరగా వచ్చిన బాలయ్య.. నేను రష్మిక మందన్నాని ప్రేమిస్తున్నాడు, మీ ఫ్రెండ్‌కి చెప్పు ఆ విషయం అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆమెని వదిలేయ్ అనే రేంజ్‌లో బాలయ్య కామెంట్ ఉండటం విశేషం. దీంతో అన్ స్టాపబుల్ షోలో హైలైట్‌గా నిలిచింది. వైరల్ అవుతుంది. ప్రోమో అదిరిపోయింది. ఇక ఫుల్ ఎపిసోడ్‌లో రష్మిక, విజయ్‌ల విషయాలు ఇంకెన్ని బయటకొస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది.