అనసూయ నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. తనపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టే వారి గురించి అనసూయ మాట్లాడింది.
నటి అనసూయ సోషల్ మీడియాలో, బుల్లితెరపై, సినిమాల్లో క్రేజీ సెలెబ్రిటిగా మారిపోయారు. బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ.. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలతో నటిగా కూడా తనదైన ముద్ర వేసింది. పుష్ప చిత్రంలో దాక్షాయణిగా అదరగొట్టింది. అనసూయ చేసే వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతుంటాయి. అందుకే ఆమె తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనసూయ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయాయి. సోషల్ మీడియాలో అనసూయకి నెటిజన్లకు ఎప్పటికీ తేలని గొడవ జరుగుతూనే ఉంటుంది. నెటిజన్లు ఏదో విధంగా కామెంట్ చేయడం ఆమె బ్లాక్ చేయడం లాంటివి షరా మామూలే.
25
30 లక్షల మందిని బ్లాక్ చేసిందట
గతంలో నెటిజన్లు అనసూయని ఆంటీ అని ట్రోల్ చేశారు. ఆ టైంలో అనసూయ చాలా మందిని బ్లాక్ చేసింది. తనని ఆంటీ అని పిలుస్తున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. తాను సోషల్ మీడియాలో ఇప్పటి వరకు 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు చెప్పింది. దీనితో యాంకర్ సైతం ఆశ్చర్యపోయారు. నిజంగానా అని అడిగారు.. దీనికి అనసూయ అవును.. అదే పనిగా బ్లాక్ చేసేదాన్ని.
35
నువ్వు నా జీవితంలో లేవు అని బ్లాక్ చేసేస్తా
ఎవడైనా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టినా, అడ్డమైన వాగుడు వాగినా వెంటనే బ్లాక్ చేసేస్తా. నువ్వు నా జీవితంలో లేవు అన్నట్లుగా బ్లాక్ చేసేస్తా. ఆ విధంగా 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు తెలిపింది. దీనితో నెటిజన్లు అనసూయని ఆడేసుకుంటుంటారు. అసలు ఒక మనిషికి 30 లక్షల మందిని బ్లాక్ చేయడం సాధ్యం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.
చెబితే కాస్తైనా నమ్మేలా ఉండాలి అని ట్రోల్ చేస్తున్నారు. రోజుకి 100 మందిని బ్లాక్ చేసినా 30 లక్షల మందిని బ్లాక్ చేయడం సాధ్యం అవుతుందా అని సెటైర్లు వేస్తున్నారు. అనసూయపై ట్రోలింగ్ ఎక్కువవుతుండడంతో ఆమెని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్పందించారు. అనసూయ చెప్పినట్లు 30 లక్షల మందిని బ్లాక్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఆమె చెప్పిన నంబర్ తప్పై ఉండొచ్చు.
55
అనసూయని ట్రోల్ చేయడం తగదు
కానీ ఆమె నిజంగానే చాలా మందిని బ్లాక్ చేసింది. అంతలా ఆమె నెగిటివిటి ఎదుర్కొంటున్నారు. ఆమె నెగిటివిటీ ఎదుర్కొంటూ ఎదిగారు. అలాంటి అనసూయని మళ్ళీ ఇప్పుడు ట్రోల్ చేయడం తగదు అని సదరు యాంకర్ నెటిజన్లని రిక్వస్ట్ చేశారు.