Chiru-Balakrishna: పనిగట్టుకొని చిరంజీవి రికార్డుని లేపేసిన బాలయ్య.. థియేటర్లో దంచుడే దంచుడు

Published : Nov 07, 2026, 09:37 AM IST

చిరంజీవి, బాలయ్య మధ్య బాక్సాఫీసు పోరు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే నలభై ఏళ్ల క్రితమే చిరంజీవి రికార్డుని పనిగట్టుకొని బాలయ్య టీమ్‌ లేపేసిందట. మరి ఆ సినిమాలేంటి? ఆ కథేంటి అనేది చూద్దాం.

PREV
14
చిరంజీవి, బాలయ్య స్నేహం

మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య ఒకప్పుడు బాక్సాఫీసు వద్ద తీవ్రమైన పోటీ ఉండేది. ఎవరిది పెద్ద హిట్‌ అనేది, అలాగే ఎక్కువ రోజులు ఆడించే విషయంలో, మాస్‌ ఎలిమెంట్లు, బాక్సాఫీసు రన్‌, స్టార్‌ ఇమేజ్‌, మార్కెట్‌, కలెక్షన్లు ఇలా ప్రతి విషయంలో పోటీ ఉండేది. అయితే ఈ పోటీ సినిమాలకు, అభిమానులకే పరిమితం. వాళ్లిద్దరి మధ్య మాత్రం మంచి స్నేహమే ఉండేది.

తనకు ఏదైనా డౌట్‌ వచ్చినా, ఏదైనా మాట్లాడాలి అనుకున్నా ఇండస్ట్రీలో తాను చిరంజీవిగారితోనే మాట్లాడతాను, ఆయన్నే కలుస్తాను అని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో బాలయ్య తెలిపారు. తనకు ఇష్టమైన వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు అని చెప్పారు. ఆ రకంగా వీరిద్దరి మధ్య బయటకు తెలియని మంచి బాండింగ్‌ ఉందని చెప్పొచ్చు.

24
బాక్సాఫీసు వద్ద చిరంజీవి వర్సెస్‌ బాలయ్య

కానీ సినిమాల మధ్య పోటీ మాత్రం గత మూడు నాలుగు, దశాబ్దాలుగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ మధ్య `ఖైదీ నెంబర్‌ 150`, `గౌతమీపుత్ర శాతకర్ణి`, మొన్న `వాల్తేర్‌ వీరయ్య`,` వీరసింహారెడ్డి` చిత్రాలతోనూ పోటీ పడ్డారు. వీరిద్దరి సినిమాలు బాగానే ఆడాయి. నువ్వా నేనా అనేట్టుగానే ఆ సమయంలోనూ హీట్‌ వాతావరణం నెలకొంది.

అయితే ఈ పోటీ ప్రారంభమైంది ఇప్పుడు కాదు 42 ఏళ్ల క్రితం నుంచే. చిరంజీవి `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`, `మంగమ్మగారి మనవడు` చిత్రం నుంచే ఈ పోటీ ఉందట. ఈ విషయాన్ని సీనియర్‌ రైటర్, జర్నలిస్ట్ శ్రీకాంత్‌ వెల్లడించారు. ఆ సమయంలో పనిగట్టుకొని చిరంజీవి సినిమా రికార్డులను బాలయ్య సినిమా టీమ్‌ లేపేసిందట.

34
అత్యధిక రోజులు థియేటర్లో ఆడిన చిరంజీవి మూవీ

దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకుడిగా మారి `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` మూవీని రూపొందించారు. చిరంజీవి, మాధవి జంటగా నటించారు. ఇదొక ఫ్యామిలీ డ్రామా. 1982, ఏప్రిల్‌ 22న విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్‌ అయ్యింది. నారాయణగూడలోని శాంతి థియేటర్లో 525 రోజులు ఆడిందట. అప్పట్లో అదొక రికార్డు. కెరీర్‌ బిగినింగ్‌లోనే చిరంజీవికి ఈ రేంజ్‌ హిట్‌ పడటం విశేషం. ఆయనకు కమర్షియల్‌గా బిగ్‌ బ్రేక్‌ ఇచ్చిన `ఖైదీ` కంటే ముందే ఈ చిత్రం వచ్చింది. సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది.

44
చిరంజీవి రికార్డుని బ్రేక్‌ చేసిన బాలయ్య మూవీ

ఆ తర్వాత కోడిరామకృష్ణ చాలా సినిమాలు చేశారు. రెండేళ్ల తర్వాత బాలయ్య హీరోగా `మంగమ్మగారి మనవడు` మూవీని రూపొందించారు. ఇందులో బాలకృష్ణ, సుహాసిని జంటగా నటించారు. భానుమతి కీలక పాత్ర పోషించింది.

ఇది కూడా విలేజ్‌ ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామా. ఇందులోని `దంచవే మేనత్త కూతురా` పాట ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఈ సాంగ్‌ అలరిస్తుంది. ఎవర్‌ గ్రీన్‌ అని చెప్పొచ్చు. ఈ సినిమా 1984 సెప్టెంబర్ 7న విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` పేరుతో ఉన్న రికార్డుని బ్రేక్‌ చేసింది.

ఈ చిత్రాన్ని నారాయణగూడలోని శాంతి థియేటర్లో ఏకంగా 532రోజులు ఆడించారట. చిరంజీవి పేరుతో ఉన్న రికార్డుని బ్రేక్‌ చేసేందుకే ఎక్కువ రోజులు ఆడించారట. అందులోనే కాదు ఓవరాల్‌గా ఈ మూవీ 565 రోజులు ఆడిందట.

అప్పట్లో అత్యధిక రోజులు థియేటర్లో ఆడిన సినిమాగా `మంగమ్మగారి మనవడు` రికార్డ్ క్రియేట్‌ చేసింది. కలెక్షన్ల పరంగానూ రికార్డులు క్రియేట్‌ చేసిందని సమాచారం. ఇలా అప్పట్లోనే చిరంజీవి, బాలయ్య మధ్య బాక్సాఫీసు పోటీ ఉండేది. అందుకు దర్శకుడు కోడిరామకృష్ణ కారణం కావడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories