ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబరు 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్‌లో బాలకృష్ణని కలిసి, సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.