Krithi Shetty: కృతి శెట్టికి మరో షాక్? అమ్మడు టైం ఏం బాగోలేదే!

Published : Aug 13, 2022, 07:15 AM ISTUpdated : Aug 13, 2022, 11:12 AM IST

ఓవర్ నైట్ స్టార్ కృతి శెట్టికి రెండో ప్లాప్ పడ్డట్లే. హ్యాట్రిక్ విజయాల ఈ లక్కీ హీరోయిన్ టైం ఏం బాగోలేదు. కృతి నటించిన వారియర్ ప్లాప్ కాగా... లేటెస్ట్ రిలీజ్ మాచర్ల నియోజకవర్గం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.   

PREV
15
Krithi Shetty: కృతి శెట్టికి మరో షాక్? అమ్మడు టైం ఏం బాగోలేదే!

ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు కృతి శెట్టి(Krithi Shetty). దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021 అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. భారీ లాభాలు పంచి కఠిన పరిస్థితుల్లో టాలీవుడ్ ని ఆదుకుంది. ఈ మూవీ యూత్ ని ఊపేయగా కృతి శెట్టి భారీగా ఫేమ్ తెచ్చుకుంది. యంగ్ కాలేజ్ గర్ల్ గా కృతి మనసుల్ని దోచేశారు. ఉప్పెన విజయంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె వరుసగా అనేక చిత్రాలకు సైన్ చేశారు. 

25


ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో వస్తూ వస్తూనే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇది అతి కొద్ది మంది హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్. అయితే ఆమెకు తిరోగమనం మొదలైనట్లు అనిపిస్తుంది. కృతి శెట్టి నటించిన ది వారియర్ మూవీ ప్లాప్ అయ్యింది. రూ. 10 నుండి 15 కోట్ల నష్టాలు మిగిల్చిన ది వారియర్ టాలీవుడ్ డిజాస్టర్స్ లో ఒకటిగా చేరింది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా విడుదలైన ఈ మూవీ రొటీన్ కమర్షియల్ సినిమా అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. 
 

35


ఇక లేటెస్ట్ రిలీజ్ మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నితిన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి విమర్శకులు దారుణమైన రేటింగ్ ఇచ్చారు. కొత్తదనం లేని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు.  బాడ్ టాక్ నేపథ్యంలో ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గం బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు. మరి అదే జరిగితే కృతి శెట్టి వరుసగా మరో ప్లాప్ ఖాతాలో వేసుకున్నట్లే. 

45

ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ హోదా వైపు అడుగులు పడుతున్న కృతి శెట్టికి ఈ పరాజయాలు భారీ నష్టం కలిగించే అవకాశం కలదు. ఇక వచ్చే నెలలో సుధీర్ కి జంటగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' విడుదల కానుంది. ఏమాత్రం ఫార్మ్ లో లేని మోహన కృష్ణ ఇంద్రగంటి, సుధీర్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఏమాత్రం అంచనాలు లేవు. ఆ చిత్రం కూడా అటూ ఎటూ అయితే ఆమె హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసినట్లవుతుంది. 

55

కాగా కృతి శెట్టి హీరో నాగ చైతన్యతో మరోసారి జోడీ కట్టనుంది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న బైలింగ్వల్ మూవీలో కృతి హీరోయిన్ గా ఎంపికయ్యారు. అలాగే హీరో సూర్యకి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు. 20 ఏళ్ళు కూడా నిండని ఈ యంగ్ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories