Karthikeya 2 Review: కార్తికేయ 2 ప్రీమియర్ టాక్... మూవీ హిట్టా ఫట్టా?

First Published | Aug 13, 2022, 6:23 AM IST

హీరో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. సీక్వెల్ గా తెరకెక్కిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ 2 ప్రీమియర్స్ ముగియగా ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.. 

హీరో నిఖిల్(Nikhil), చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. సీక్వెల్ గా తెరకెక్కిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ 2 ప్రీమియర్స్ ముగియగా ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.. Karthikeya 2 Review.

కథ 
కార్తికేయ 2 ఊహాజనితమైన కథతో తెరకెక్కింది. శ్రీకృష్ణ భగవానుడు కాలి కంకణం చుట్టూ కథ నడుస్తుంది. అది ఏమైంది? ఎక్కడి ఉంది? కార్తికేయ(నిఖిల్) దాన్ని ఎందుకు వెతుకుతున్నాడు? కార్తికేయతో పాటు ఇంకెవరికి అది కావాలి? దాని కోసం కార్తికేయ సాగించిన సాహసోపేత ప్రయాణం ఎలా సాగింది అనేది చిత్ర కథగా చెప్పవచ్చు.  Karthikeya 2 Review.

Latest Videos


ఓ సూపర్ హిట్ సీక్వెల్ పై అంచనాలు ఏర్పడడం సాధారణం. 2014లో విడుదలైన కార్తికేయ సూపర్ హిట్. దర్శకుడు చందూ మొండేటి ఈ మూవీతో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి కార్తికేయ స్థాయిలో కార్తికేయ 2 ఆయన తెరకెక్కించగలిగాడా అంటే... కొంత మేరకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఓ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 పట్ల ఆడియన్స్ చాలా వరకు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. Karthikeya 2 Review.

డాక్టర్ కార్తికేయ మిస్టీరియస్ అడ్వెంచరస్ జర్నీ ఆసక్తికరంగానే సాగిందనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. అద్భుతమైన నిర్మాణ విలువలకు తోడు పట్టున్న స్క్రీన్ ప్లే, కొత్త కథ సినిమాకు ప్రధాన బలంగా చెబుతున్నారు. ఆద్యంతం ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ దర్శకుడు కలిగించగలిగాడు అంటున్నారు. సినిమా ఆరంభంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. ఓ ఊహాజనిత లోకంలో ప్రేక్షకులు కొంత సేపు విహరిస్తాడు. విజువల్స్ మరో పాజిటివ్ కోణంగా చెప్పుకుంటున్నారు. మూవీలోని లొకేషన్స్ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతాయి.

ఇక నటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే... నిఖిల్ వన్ మాన్ షో. డాక్టర్ కార్తికేయ సాహసోపేత ప్రయాణంగా కార్తికేయ 2 సాగిపోతుంది. కార్తికేయ 2ని నిఖిల్ అన్నీ తానై నడిపించాడు. సీరియస్, ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో నిఖిల్ ఇరగదీశాడు. ఆయనకు ఇదో మంచి చిత్రం అవుతుందని అంటున్నారు.

 హీరోయిన్ అనుపమ హీరో ప్రయాణంలో మద్దతుగా కనిపించే ఓ పాత్ర. ఆమెకు చెప్పుకోదగ్గ స్క్రీన్ ప్లే లేదు. అయినప్పటికీ ఉన్నంతలో ఆమె మెప్పించారు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి పాత్ర ఆకట్టుకుంది. ఈ సీరియస్ అడ్వెంచరస్ జర్నీలో ఆయన కామెడీ ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. వైవా హర్ష, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్ తన పాత్రల పరిధి మెప్పించారు. Karthikeya 2 Review.

కార్తికేయ 2 లో కొన్ని మైనస్ లో కూడా ఉన్నాయనేది ప్రేక్షకులు అభిప్రాయం.కార్తికేయ రేంజ్ థ్రిల్ సీక్వెల్ లో లేదంటున్నారు. అలరించే చిత్రం అయినప్పటికీ భారీ ట్విస్ట్స్, గూస్ బంప్స్ కల్గించే రేంజ్ ఈ చిత్రానికి లేదు. అలాగే స్లో అండ్ ఫ్లాట్ నేరేషన్ కొంచెం నిరాశ పరిచే అంశం. బీజీఎం ఇంకొంత మెరుగ్గా ఉంటే బాగుండేది అంటున్నారు.

మొత్తంగా కార్తికేయ 2 ప్రేక్షకుల అంచనాలు అందుకుంది. ఓ కొత్త కథను ఆకట్టుకునే కథనంతో దర్శకుడు నడిపించాడు. హీరో నిఖిల్ అన్నీ తానై సినిమాను నడిపించగా ఆయన సాహసాలు మెప్పిస్తాయి. మూవీ చిత్రీకరించిన లొకేషన్స్, విజువల్స్ మరో ప్రపంచానికి తీసుకెళతాయి. స్లో అండ్ ఫ్లాట్ నెరేషన్, చెప్పుకోదగ్గ థ్రిల్స్, ట్విస్ట్స్ లేకపోవడం ప్రధాన మైనస్లు. పార్ట్ 1 వన్ రేంజ్ లో లేకున్నా... కార్తికేయ 2 ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. 

click me!