కాబోయే భర్త అలా ఉండాలట, బేబీ హీరోయిన్ వైష్ణవి కామెంట్స్ వైరల్..

Mahesh Jujjuri | Published : Sep 10, 2023 3:21 PM
Google News Follow Us

బేబీ` సినిమాతో పాపులర్‌ అయ్యింది వైష్ణవి చైతన్య. ఈ సినిమా ఆమెకి ఎక్కువ పేరొచ్చింది. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లని అందుకుంటుంది. 

16
కాబోయే భర్త  అలా ఉండాలట, బేబీ హీరోయిన్ వైష్ణవి  కామెంట్స్ వైరల్..

చిన్న సినిమా.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్  ఇండస్ట్రీ చూపును  మొత్తంత  తన వైపు తిప్పుకుంది వైష్ణవీ చైతన్య.  బేబీ సినిమాతో హీరోయిన్ గా గా ఎంట్రీ ఇచ్చిన  వైష్ణవి చైతన్య... కెరీర్ బిగినింగ్ లో మాత్రం  కొన్ని వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ తీసింది. కాని వాటి ద్వారా పెద్దగా గుర్తింపురాలేదు ఆమెకు. అయితే  షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ మాత్రం భారీ రెస్పాన్స్ సాధించింది. అప్పటి నుంచి ఆమెకు కాస్త క్రేజ్ స్టార్ట్ అయ్యింది. 
 

26

ఈవెబ్ సిరీస్ తరువాత వైష్ణవికి సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. అయితే హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ రాలేదు. సినిమాల్లో చెల్లి పాత్రల్లో అవకాశాలు వచ్చాయి. ఇక అల్లు అర్జున్ తో కలిసి అల వైకుంటపురంలో సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లి గా నటించింది వైష్ణవి. ఆతరువాత  నాగశౌర్యతో వరుడు కావలెను అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. 

36

అలా సాగిపోతున్న కెరీర్ లో ..  వైష్ణవి చైతన్యకు సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా (Baby movie) లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.   ఏదో చిన్న సినిమాగా స్టార్ట్ అయిన బేబీ.. టాీవుడ్ లో సంచలనం సృష్టించింది.  ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 

Related Articles

46

ఇక ఈ సినిమా చూడని యూత్ అంటూ ఉండరు.. యువతను ఉర్రూతలూటిచిన ఈసినిమా  చాలామంది లవ్ ఫెయిల్యూర్స్ కి  బాగా కనెక్ట్ అయింది. ఈ విషయం పక్కన పెడితే..ఎప్పుడైతే వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఫేమస్ అయిందో ఆ సినిమా హిట్ అయినప్పటి నుండి చాలామంది వైష్ణవి చైతన్య (Vaishnavi Chaithanya) గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఆరాటపడుతున్నారు. 
 

56

అయితే ఆ మధ్యకాలంలో వైష్ణవి చైతన్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలో ఉండే క్వాలిటీస్ చెప్పింది. వైష్ణవి చైతన్య ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను కాబోయే భర్త పై భారీ అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు.ఆస్తిపాస్తులు ఏమీ లేకున్నా,అందచందమేమీ లేకపోయినా నాకు పరవాలేదు. మంచి మనసు ఉంటే చాలు అంటోంది. 
 

66

ఈసినిమా తరువాత వరుసగా ఆఫర్లు సాధిస్తోంది వైష్ణవి. తాజాగా ఇద్దరు స్టార్ హీరోల సరసన రెండు పెద్ద ప్రాజెక్ట్ లలో కూడా ఆమెకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఈసినిమాలో తన నటనకు ఫిదా అయ్యి ఎంతో మంది వైష్ణవికి ఫ్యాన్స్ అయ్యారు. మరికొంత మంది మాత్రం ఈసినిమాలో వైష్ణవి క్యారెక్టర్ ను తిడుతూ.. ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె ఈసినిమాతో స్టార్ గా మారిపోయింది. 

Recommended Photos