బాబు గోగినేని ట్విట్టర్ లో ఏమని రివ్యూ ఇచ్చారంటే.. రాజమౌళి గారు ఈ సినిమాను చాలా పెద్దగా.. గ్రాండ్గా తీశారు. ఈ మూవీని ఒక చరిత్రగా నిలపడం కోసం చాలా కష్టపడ్డారు. అద్భుతమైన నటన,సూపర్ సినిమాటోగ్రఫి. కాని కథ బలహీనంగా ఉంది.. అలాగే హీరోలిద్దరి సంబంధాలు పేలగా ఉన్నాయి. గుర్తుండిపోయే డైలాగ్స్ లేవు అంటూ ఒక్క మాటలో లోడ్..ఎయిమ్..షూట్..అంతే అన్నారు. కథ చాలా నాసిరకంగా ఉంది. ఈ సినిమాలో ఉన్న మహిళ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కామెడీ లేదు, లాజిక్ లేదు. పాటలకు కూడా అర్ధం పర్థం లేదు అంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు.