పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ ట్రీట్, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్..

Published : Feb 23, 2026, 09:06 AM IST

ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ పవన్ ప్యాక్ పెర్ఫామెన్స్ తో ఉర్రూతలూగించేలా.. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ను రిలీజ్ చేశారు.

PREV
15
ఏమాత్రం తగ్గని పవర్ స్టార్ క్రేజ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు ఓ పండుగ. ఇక పవన్ కళ్యాణ్‌ మేనరిజమ్స్‌ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా, లక్షలాది మంది పవన్ కళ్యాణ్  ఐకానిక్ మేనరిజమ్‌లను అనుకరించారు. 

ఆ స్వాగర్‌ను, ఆ ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్‌ను, అటిట్యూడ్‌ను పక్కాగా ఇమిటేట్ చేయాలని చాలామంది ప్రయత్నించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ దానికి అసలైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నపవన్.. తన అభిమానుల కోసం చాలా కష్టపడుతున్నాడు.

25
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్ డేట్స్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ విశేషంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవర్‌స్టార్ ను ఆవిష్కరించిన ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.

35
ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్..

ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రెండవ గీతంగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ లో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పవర్‌స్టార్ ఆరాను ప్రతిబింబించేలా ఈ గీతముంది. “నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే” అనే లైన్ కేవలం పవర్‌ఫుల్‌గా వినిపించడమే కాదు.. అది పవర్ స్టార్ అభిమానులకు కనువిందు చేస్తుంది.

45
సినిమాపై అంచనాలను పెంచేసిన దేవిశ్రీ ప్రసాద్..

కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులు సంవత్సరాల పాటు గుర్తుంచుకునే ఒక సాంగ్ ను అందించారు. ఇది కేవలం పాట మాత్రమే కాదు... ఒక పండుగ. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన హై-వోల్టేజ్ కంపోజింగ్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు. మాస్ ఎనర్జీతో నిండిన ఈ సాంగ్ అభిమానులను మాత్రమే కాదు.. అన్ని రకాల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. చంద్రబోస్ రాసిన సాహిత్యం పవన్ కళ్యాణ్.. చరిష్మాను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది.

55
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడు?

ఇది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చిన పాట కాదు. ఆయన మీద అవగాహనతో రాసిన పాట. ఏ లైన్ విన్నా పవన్ కళ్యాణ్ కళ్లముందు కదిలేలా పాటను రూపొందించారు. ''ఈ పాటలోని 'మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు.. బండరాళ్లను బద్దలుకొట్టిన మొండి మొక్కవు నువ్వు' అనే లైన్ నాకు బాగా నచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ గారు ఈ పాటకు ప్రాణం పెట్టారు.

పవన్ కళ్యాణ్ కి దేవి శ్రీ ప్రసాద్ గారు పాటాభిషేకం చేస్తే, చంద్రబోస్ గారు సిరాభిషేకం చేశారని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories