మెగా స్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ హిట్స్ లో ;జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒకటి. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం వైజయంతి మూవీస్ బ్యానర్ కీర్తి కిరీటంలో కలికి తురాయిగా నిలిచింది. వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి తన దర్శకత్వ ప్రతిభని అంతా జోడించారు.