అషురెడ్డి సోలో ట్రిప్.. ఒక్కతే ఎక్కడికెళుతోంది? స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసిన జూ. సమంత!

First Published | Feb 18, 2023, 3:19 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో నటిగా వరుస అవకాశాలను అందుకుంటుండగా.. ఇక నిత్యం నెట్టింట క్రేజీ  పోస్టులు, అప్డేట్స్ తో ఆకట్టుకుంటున్నారు.  

యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. దీంతో యూత్ లో గట్టి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. 
 

ఈ సందర్భంగా అషురెడ్డి తాజాగా ఓ క్రేజీ పోస్టు పెట్టారు. ఈ పోస్టు ద్వారా తను సోలోగా ఫారేన్ ట్రిప్ కు వెళ్తున్నట్టు  తెలిపారు. ఈ సందర్భంగా అదిరిపోయే కామెంట్స్ కూడా చేశారు. ‘ఇది మనల్ని మనం ప్రేమించుకునే సమయం.. ఇదే ఒంటరి యాత్రకు సమయం’ అంటూ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ కూడా ఇచ్చారు. 
 


తన ట్రిప్ కు సంబంధించిన కొన్ని ట్రావెలింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు అషురెడ్డి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అషురెడ్డి ఆకట్టుకుంటున్నారు. రకరకాల అవుట్ ఫిట్లలో, మతులుపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చారు. 

అయితే, అషు పంచుకున్న పిక్స్ లో కొన్ని సెల్ఫీ ఫొటోలతో పాటు..  కొన్ని నార్మల్ ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో ఆ నెటిజన్ సోలో ట్రిప్ అయితే.. ఆ ఫొటోలు ఎవరు తీశారు అంటూ ప్రశ్నించారు. మరికొందరు మాత్రం తన స్టన్నింగ్ స్టిల్స్ కు ఫిదా అవుతున్నారు. ఆమె స్టైల్ ను మెచ్చుకుంటున్నారు. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 
 

ప్రస్తుతం అషురెడ్డి యూనైటెడ్ స్టేల్స్ లోని టెక్సాస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా షూటింగ్ కోసం వెళ్లారా? లేదా, రిలేటీవ్స్ వద్దకు వెళ్లురని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా అషురెడ్డి తన ప్రతివిషయాన్ని ఫ్యాన్స్ తో షేరుచేసుకుంటూ మరింత క్రేజ్ దక్కించుకుంటున్నారు. 
 

డమ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా పేరొందిన యంగ్ బ్యూటీ అషురెడ్డి.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంటున్నారు. చివరిగా ‘పోకస్’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాలో నటిస్తున్నారు.  దాంతో పాటు రీసెంట్ గా ఏపీలోని పులివెందులలో ఓ చిత్ర షూటింగ్ కు కూడా హాజరయ్యారు.  

Latest Videos

click me!