ప్రేమ వివాహంగా మొదలైన వీరి బంధం, కొద్దికాలానికే కష్టాలమయంగా మారింది. గణపత్‌రావ్ భోస్లేతో తన బంధంలో ఎన్నో అవమానాలు, హింసను ఎదుర్కొన్నానని ఆశా భోస్లే స్వయంగా వెల్లడించారు. కాలం గడిచేకొద్దీ పరిస్థితి మరింత దారుణంగా మారింది.
చివరకు ఆమె మూడో బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు, తనను ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నారు. ఇది ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన దశ. అయినా, ఆ తర్వాత ఆమె ఎలాంటి పగ పెంచుకోకుండా, తన పిల్లలపై దృష్టి పెట్టి, ప్రశాంతంగా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నారు.