Prema Entha Madhuram: చావు అంచుల వరకు వెళ్లిన అను.. పుట్టబోయే బిడ్డకు పెద్ద ముప్పు?

Published : May 18, 2023, 07:05 AM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో  ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తనకి ప్రయారిటీ ఇవ్వటం లేదన్న కోపంతో తోటి కోడల్ని చంపించాలనుకున్న ఒక పెద్దింటి కోడలి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
110
Prema Entha Madhuram: చావు అంచుల వరకు వెళ్లిన అను.. పుట్టబోయే బిడ్డకు పెద్ద ముప్పు?

ఎపిసోడ్ ప్రారంభంలో పుట్టబోయే బిడ్డ మీద బ్రో ఇన్ లా చాలా హోప్స్ పెట్టుకున్నారు. డే బై డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. వాళ్లు చేసే పనులు చూస్తే నాకు చిరాకేస్తుంది ఎలా అయినా బ్రో ఇన్ లా బేబీ బయటకి రాకూడదు. నువ్వు ఏం చేస్తావో తెలియదు బేబీ పుట్టిన వెంటనే రిప్ అంటూ మెసేజ్లు పెట్టాలి అని జలంధర్ కి చెప్తుంది మాన్సీ.
 

210

బేబీ బర్త్ డే, డెత్ డే రెండు ఒకరోజే సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. బేబీ పుట్టక ముందే చావు తనకోసం ఎదురుచూస్తుంది. అప్పట్లో అష్టమి రోజు పుట్టిన ఆ కృష్ణుడికి అలా జరిగింది మళ్లీ ఇప్పుడు ఆర్య బేబీకి అలా జరుగుతుంది నువ్వేమీ కంగారు పడకు అంటూ హాస్పిటల్ అడ్రస్ కనుక్కుంటాడు జలంధర్. నేను కూడా అదే హాస్పిటల్ కి వెళ్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు.
 

310

మరోవైపు ఆర్య వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు. రేపటి నుంచి మనం దూరమైపోతాం కదా అంటుంది అను. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతాడు ఆర్య. ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. రేపు మనిద్దరి మధ్యలోకి బేబీ వస్తుంది మీరు బేబీకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు నాకు అసలు టైం ఇవ్వరు అంటూ బుంగమూతి పెడుతుంది అను.
 

410

అలాంటిదేమీ జరగదు ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకే భర్త కంటే పిల్లలంటే ఎక్కువ ఇష్టమంట.. బేబీని చూసుకొని నన్ను దూరం పెడతావేమో అంటాడు ఆర్య. ఆర్య నోరు గట్టిగా మూసేసి అలా ఎప్పటికీ జరగదు మీ తర్వాతే నాకు ఎవరైనా అను. దారిలో మొక్కజొన్నలు కాలుస్తున్న బండి కనిపిస్తే ఆగుతాడు ఆర్య. జొన్నపొత్తులు తింటావా అని భార్యని అడుగుతాడు.
 

510

ముందు నాకు సమాధానం చెప్పండి అంటుంది అను. దేని గురించి అంటాడు ఆర్య. అదే బేబీ పుట్టాక మనం దూరం అవ్వం కదా అంటుంది అను. దూరం అవ్వటానికి మనం ఇద్దరం కాదు ఒక్కరమే అంటాడు ఆర్య. ఆ మాటలకి సంతోషించి మొక్కజొన్నలు తినటానికి వస్తుంది అను. పోటీ పెట్టుకుందాం సార్ ఎవరు ఫాస్ట్ గా తింటే వాళ్ళే గెలిచినట్లు ఉంటుంది అను.
 

610

ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటాడు ఆర్య. ప్రపంచాన్ని జయించిన మీ నాన్నని నేను జయించాను అని రేపు పుట్టబోయే బిడ్డకు నేను గొప్పగా చెప్పుకుంటాను అంటుంది అను. ఆర్య సరే అనటంతో ఇద్దరూ పోటీ పడి తింటారు. ఆర్య కావాలనే ఓడిపోతాడు. కారు లో కూర్చున్న తర్వాత మీరు కావాలనే ఓడిపోయారు కదా అంటుంది అను.
 

710

అవును అంటూ కారు స్టార్ట్ చేస్తాడు ఆర్య. కారు స్టార్ట్ అవ్వకపోతే చెక్ చేయడానికి కిందకి దిగుతాడు. చెక్ చేసి తిరిగి వచ్చేటప్పటికి కారులో అను ఉండదు. కంగారుపడి చుట్టూ వెతుకుతాడు. మరోవైపు అను డెలివరీ కోసం నా ఫ్రెండ్ పద్మజ ఉంది తనని డెలివరీలో అటెండ్ అవ్వమన్నాను అంటుంది అంజలి. వద్దు అంజలి నీరజ్ అన్నీ అరేంజ్ చేసేసాడు అంటాడు జెండే.
 

810

కచ్చితంగా అనుకి ట్విన్స్ పుడతారు అంటూ ఆనందపడుతుంది అంజలి. అప్పుడే అక్కడికి వచ్చిన మాన్సీ ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది. మాన్సీ ని నోరు ముయ్యమంటాడు నీరజ్. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు అంజలి అంటూ లోపలికి వస్తాడు మదన్. ఇన్ని మాటలు పడటానికేనా అంత డబ్బు ఇచ్చి మరీ ఈ ఫ్యామిలీలోకి వచ్చావు.
 

910

నిన్ను ఇక్కడ ఉంచను.. నిన్ను నీతో పాటు 1300 కోట్ల డబ్బుని వెనక్కి తీసుకుంటాను అవసరం అయితే నిన్ను చీట్ చేశారు అంటూ కోర్టులో కేసు వేస్తాను అంటాడు  మదన్. షాక్ అవుతుంది అంజలి. నీ నీడ కూడా నా కుటుంబం మీద పడకుండా చూసుకుంటాను ఫస్ట్ నువ్వు ఇంట్లోంచి బయటికి నడువు అంటూ కోపంగా అంటుంది అంజలి.
 

1010

వెళ్తాను కానీ నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లే వరకు నిద్రపోను అంటూ చెల్లెలి తో ఛాలెంజ్ చేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మదన్. మరోవైపు అనుని లాక్కెళ్లి చంపటానికి ప్రయత్నిస్తారు దుండగులు. కరెక్ట్ టైం కి ఆర్య వచ్చి అనుని సేవ్ చేస్తాడు. అక్కడే ఉంటే ప్రమాదం అని ఆమెని ఎత్తుకొని పరిగెడతాడు. దారిలో ఒక గుడి కనిపిస్తే అందులో అనుని కూర్చోబెడతాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం

click me!

Recommended Stories