Enugu: అరుణ్ విజయ్ 'ఏనుగు' మూవీ రివ్యూ

First Published Jul 2, 2022, 1:00 PM IST

పాపులర్ తమిళ నటుడు అరుణ్ విజయ్, మాస్ చిత్రాల దర్శకుడు హరి కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం 'ఏనుగు'. 

పాపులర్ తమిళ నటుడు అరుణ్ విజయ్, మాస్ చిత్రాల దర్శకుడు హరి కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం 'ఏనుగు'. అరుణ్ విజయ్ ప్రభాస్ సాహో చిత్రంలో నటించాడు. అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక డైరెక్టర్ హరి గురించి చెప్పనవసరం లేదు. హరి తెరకెక్కించిన సింగం సిరీస్ కి తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. దీనితో ఏనుగు చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. మరి థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది సమీక్షలో తెలుసుకుందాం. 

కథ

పీవీఆర్ అనే కుటుంబంలో రవి (అరుణ్ విజయ్) చిన్నవాడు. పీవీఆర్ కుటుంబానికి అతడి సవతి తల్లి కొడుకులకు (సముద్రఖని , సంజీవ్, వెంకట్) రవి రక్షణ కవచంలా ఉంటాడు. అయితే పివిఆర్ కుటుంబానికి, సముద్రం అనే మరో ఫ్యామిలీ మధ్య శత్రుత్వం ఉంటుంది. పివిఆర్ సవతి తల్లి కొడుకులకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. దీనితో సముద్రం కుటుంబంతో మరింత వైరం పెరుగుతుంది. సముద్రం కొడుకులు బాచి, లింగం(కెజిఎఫ్ రామచంద్ర) ఇద్దరూ ట్విన్ బ్రదర్స్. బాచి ప్రమాదంలో మరణిస్తాడు. 

లింగంకి, రవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంటుంది. కథలో ఒక ఊహించని పరిణామం ఏర్పడుతుంది. దీనితో సముద్రం, లింగం ఇద్దరూ పివిఆర్ ఫ్యామిలీని చంపేయడానికి డిసైడ్ అవుతారు. పివిఆర్, సముద్రం ఫ్యామిలీ మధ్య వైరం ఎందుకు ఉంది ? సముద్రం.. పివిఆర్ ఫ్యామిలీని చంపాలని ఎందుకు అనుకుంటున్నాడు ? రవి తన ఫ్యామిలీని రక్షించుకున్నాడా ? ఈ క్రమంలో అతడికి ఎదురైనా సవాళ్లు ఏంటి ?అనే అంశాలు సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ 

అరుణ్ విజయ్ కి ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పడిందనే చెప్పాలి. దర్శకుడు హరి హీరోలని ఎంత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తారో తెలిసిందే. హరి ప్రజెంటేషన్ కి అరుణ్ విజయ్ వంద శాతం న్యాయం చేసాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో, ఫ్యామిలీ ఎమోషనల్ లో అతడి పెర్ఫామెన్స్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలని దర్శకుడు హరి ఈ చిత్రంలో అక్కడక్కడా చాలా బాగా సెట్ చేశారు. 

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చూస్తుంటే దర్శకుడి హరి మార్క్ స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ని 100 శాతం ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. అరుణ్ విజయ్ తన నటనతో కథని ముందుకు నడిపించాడు. ప్రియా భవాని శంకర్ తో లవ్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వీళిద్దరి రొమాన్స్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. దర్శకుడు హరి కామెడీని కూడా సమపాళ్లలో జోడించారు. 

చాలా తెలివిగా యోగి బాబు పాత్రని వాడుకున్నారు. అతడిని ఫ్యామిలీ సీన్స్ లో ఇన్వాల్వ్ చేస్తూ మంచి హ్యూమర్ రాబట్టారు. ఈ చిత్ర కథ అయితే రొటీన్ అనే చెప్పాలి. మనం చూసే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటుంది. కానీ కథకి దర్శకుడు హరి మార్క్ తోడైంది. కాబట్టి చూడ దగ్గ చిత్రం గా మారింది. రెగ్యులర్ గా హరి చిత్రాల్లో చూసే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో కూడా ఉంటాయి. 

ఇక ఫస్ట్ హాఫ్ తో దర్శకుడు మంచి అంచనాలు సెట్ చేయగా.. సెకండ్ హాఫ్ లో పూర్తిగా తడబడ్డారు. సెకండ్ హాఫ్ లో చూపించిన ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఫోర్స్ ఫుల్ గా అనిపిస్తాయి. ఫలితంగా ఆడియన్స్ కొంతవరకు బోరింగ్ ఫీల్ అవుతారు. కొన్ని సన్నివేశాలు అనవసరంగా పెట్టడం కథ ట్రాక్ తప్పింది అనే ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ కొంత డిఫెరెంట్ గా ఉండడం వల్ల సెకండ్ హార్ఫ్ సేవ్ అయ్యిందనే చెప్పాలి. 

టెక్నికల్ గా 

గోపినాథ్ అందించిన కెమెరా వర్క్ బావుంది. ఈ చిత్రం ఎక్కువగా సముద్ర తీరంలో జరుగుతుంది. ఆ లొకేషన్స్ ని అద్భుతంగా చూపించడంలో గోపినాధ్ విజయవంతం అయ్యారు. చాలా వరకు యాక్షన్ సన్నివేశాల్లో కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త ద్రుష్టి పెట్టి ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి ఉంటే అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది. 

జివి ప్రకాష్ అందించిన పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. కానీ హీరో ఎలివేషన్ కి తగ్గట్లుగా ఇచ్చిన బిజియం మాత్రం మెప్పించే విధంగా ఉంది. డబ్బింగ్, డైలాగులు బావున్నాయి. దర్శకుడు హరి విషయానికి వస్తే.. అతడి చిత్రాల్లో మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కథ కూడా ఉంటుంది. కానీ ఈ మూవీలో ఆయన రొటీన్ కమర్షియల్ పాయింట్ ఎంచుకున్నారు. అయనప్పటికీ తన టేకింగ్, మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిగా అనిపించే గట్టిగా అరుపులు అరవడం లాంటి సన్నివేశాలని హరి ఈ చిత్రంలో తగ్గించారు. 

ఫైనల్ థాట్ : ఈ మూవీలో మంచి మాస్ ఎలిమెంట్స్ అక్కడక్కడా ఉన్నాయి. డైరెక్టర్ హరి చిత్రాలని ఎంజాయ్ చేసే వారు ఈ మూవీని ఒక సారి ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2.75/5

click me!