Arjuna Phalguna Review: అర్జున-ఫల్గుణ మూవీ రివ్యూ.. శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో..

First Published | Dec 31, 2021, 9:33 AM IST

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మర్నీ డైరెక్షన్ లో మాట్నీ ఎంటర్టైన్మెట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన సినిమా అర్జున ఫల్గుణ. ఈరోజు రిలీజ్ అయిన ఈమూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం..

Arjuna Phalguna

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మర్నీ డైరెక్షన్ లో మాట్నీ ఎంటర్టైన్మెట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన సినిమా అర్జున ఫల్గుణ. గెలుపుఓటములతో సంబంధం లేకుండా.. కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్న హీరో శ్రీవిష్ణు..మరోసారి కథను నమ్ముకుని చేసిన సినిమా ఇది. మరి ఈరోజు (డిసెంబర్ 31) రిలీజ్ అయన అర్జున-ఫల్గుణ ఎంత వరకూ ఆడియన్స్ ను మెప్పించాడు. సినిమా హిట్టా.. ఫట్టా.. చూద్దాం..

Arjuna Phalguna

రాజ రాజ చోర సినిమా తరువాత శ్రీవిష్ణు  నుంచి వచ్చిన సినిమా ఇది. కొత్త దర్శకుడు తేజ మర్ని కథను నమ్మి సినిమా చేశాడు విష్ణు. తాను చేస్తున్న సినిమాలతో కమర్షియల్ సక్సెస్ లు రాకపోయినా.. శ్రీవిష్ణు అంటే ఓ మార్క్.. స్పెషల్ ఇమేజ్ మాత్రం ఏర్పడింది ఇండస్ట్రీలో. సినిమాల విషయంలో విష్ణు టేస్ట్ ఆడియన్స్ కు తెలుసు. అటు ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కన్నడ సోయగం అమృతా కూడా క్లాసిక్ మూవీస్ తోనే ఫేమస్ అయ్యింది. తెలుగులో అమృతకు ఇది మూడో సినిమా. మరి వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాలో ఎలా వర్కౌట్ అయ్యింది..?


arjuna,palguna

అర్జున-ఫల్గుణ కథ విషయానికి వస్తే.. ఒక ఊరిలో బాగా క్లోజ్ గా ఉండే  ఐదుగురి ఫ్రెండ్స్ అర్జున్, రాంబాబు, తడ్డోడు, ఆస్కార్, శ్రావణి. వీరు చేసే కొంటె పనులకు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సినిమా కథ మొత్తం ఈ ఐదుగురి చుట్టూ తిరుగుతుంది. అయితే వారి పేర్లను గమ్మత్తుగా ఆది, రాఖీ, సింహాద్రి, యమదొంగ అని చెప్పుకుంటారు. సరదాగా సాగిపోతున్న వీరిజీవితాన్ని గంజాయి కేసు మలుపు తిప్పుతుంది. వీరు పోలీసులకు చిక్కినప్పటినుంచి కథ మలుపు తిరిగి ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.మరి వీరు ఆ కేసులో ఎలా ఇరుక్కున్నారు..? ఆ కేసు నుంచి బయటకు వచ్చారా లేదా...?  క్లైమాక్స్ ట్వీస్ట్ ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా కథ రొటీన్ గా ఉంది. కథలో కొత్తదనం కనిపించలేదు. కాని సినిమాకు డైలాగ్స్ మాత్రం గట్టిగా పేలాయి. క్యారెక్టర్ల మద్య కామెడీ టైమిగ్  అదిరిపోయింది.ఇక శ్రీవిష్ణు నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. సినిమా మొత్తాన్ని తన బుజాల మీద మోశాడు శ్రీవిష్ణు. పర్ఫామెన్స్ విషయంలో శ్రీవిష్ణుకు వంక పెట్టాల్సిన పనిలేదు. ఇక ఆయన జతగా శ్రావణి పాత్రలో కనిపించి అమృతా అయ్యార్ కూడా శ్రీకి తగ్గట్టుగా పోటా పోటీగా నటించింది. వీరిద్దరి జంట స్క్రీన్ పై బాగుంది. కాని మంచి కథ కూడా వీరికి సెట్ అయ్యి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్ట్ లు కూడా పర్వాలేదు అనిపించారు.

 హీరో ఎంత బాగా పెర్ఫామ్ చేసినా.. సినిమా కథ బాగుండాలి.. దానికి తగ్గట్టు సినిమాను డ్రైవ్ చేసే డైరెక్టర్ ఉండాలి. ఈ విషయంలో కొత్త దర్శకుడు తేజ తడబడ్డాడు. సినిమాను హ్యాండిల్ చేయలేకపోయాడు డైరెక్టర్. ఇక  సుధీర్ వర్మ డైలాగ్స్ లేకపోతే ఈ సినిమా చూడటం కష్టమే.కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు డైలాగ్స్ ప్రాణం పోశాయి అనుకోవాలి. ఇక ఈసినిమాకు ప్రియదర్శన్ అందించిన మ్యూజిక్ కొంత ప్లస్అయ్యింది. మిగతా టెక్నీషన్స్ బాగా పనిచేశారు.

మొత్తంగా చూసుకుంట శ్రీవిష్ణు చాలా హోప్ పెట్టుకుని చేసిన అర్జున-ఫల్గుణ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోలేకపోయింది. శ్రీవిష్ణు ఒంటరి పోరాటానికి మాత్రం మార్కులు గట్టిగానే పడ్డాయి. కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. శ్రీవిష్ణును ఇష్టపడే ఫ్యామీలీ ఆడియన్స్ మాత్రం ఒక్క సారి చూడగలిగే సినిమా అర్జున-ఫల్గుణ.

Latest Videos

click me!