49 ఏళ్ళ వయసులో మలైకా గర్భవతి అంటూ రూమర్స్.. హీరో బాగా హర్ట్ అయ్యాడుగా

First Published Nov 30, 2022, 4:53 PM IST

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా అరోరా ఒక సంచలనం. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా అరోరా ఒక సంచలనం. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

అర్జున్ కపూర్ వయసు ప్రస్తుతం 37 ఏళ్ళు. బోనీకపూర్ తనయుడైన అర్జున్ కపూర్ ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు. దీనితో అర్జున్ కపూర్.. మలైకా అరోరాతోనే లైఫ్ షేర్ చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే మలైకాని వివాహం చేసుకోవడంపై మాత్రం ఈ హీరో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. మలైకా అరోరా గర్భవతి అంటూ బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలయింది. దాదాపు ఐదు పదుల వయసులో మలైకా గర్భవతా అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. 

అయితే ఈ రూమర్స్ పై అర్జున్ కపూర్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చేశాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ తన పర్సనల్ లైఫ్ కి డ్యామేజ్ గా మారుతుండడంతో అర్జున్ కపూర్ వెంటనే స్పందించాడు. మలైకా గర్భవతి అంటూ ప్రచారం చేస్తున్న మీడియాపై విరుచుకుపడుతూ కామెంట్స్ చేశాడు. 

ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసి మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవడద్దు అంటూ కామెంట్స్ చేశాడు. ఈ ఫేక్ న్యూస్ వల్ల అర్జున్ కపూర్ బాగా హర్ట్ అయినట్లు అర్థం అవుతోంది. వేగంగా స్పందించి ఈ ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ కాకుండా అర్జున్ కపూర్  జాగ్రత్త పడ్డాడు. మలైకా అరోరా బాలీవుడ్ హాట్ అణుబాంబు అనే చెప్పాలి. ప్రేమ కథలు సహజమే అయినప్పటికీ వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం హాట్ టాపిక్ గా మారింది.  

click me!