శోభా శెట్టి గురించి నోరు జారి అంతమాట అనేసిన అర్జున్, అదే నిజం అంటున్న నెటిజన్లు..కన్నీళ్లు పెట్టుకుంటూ..

Sreeharsha Gopagani | Published : Nov 16, 2023 4:13 PM
Follow Us

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ పోరు మొదలైనట్లే అని చెప్పాలి. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు.

16
శోభా శెట్టి గురించి నోరు జారి అంతమాట అనేసిన అర్జున్, అదే నిజం అంటున్న నెటిజన్లు..కన్నీళ్లు పెట్టుకుంటూ..

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ పోరు మొదలైనట్లే అని చెప్పాలి. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో శివాజీ, ప్రియాంక, యావర్, ప్రశాంత్, శోభా శెట్టి గౌతమ్ బలమైన కంటెస్టెంట్స్ కాగా కనిపిస్తున్నారు. 

 

26

ఇక మధ్యలో వచ్చిన వాళ్లలో అర్జున్ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తున్నాడు. బుధవారం జరిగిన ఎపిసోడ్ లో అర్జున్ ఎవిక్షన్ పాస్ కూడా గెలిచేశాడు. దీనితో అర్జున్ టాప్ 5 లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నిన్న జరిగిన ర్యాంకింగ్ ప్రక్రియలో అర్జున్, శోభా శెట్టి మధ్య వాగ్వాదం జరిగింది. 

36

అదేంటంటే.. ఇంటి సభ్యులంతా శోభా శెట్టి 5 వ స్థానంకి అర్హురాలు అని నిర్ణయించారు. కానీ అర్జున్ మాత్రం తాను అయితే శోభాకి 7 వ ర్యాంక్ ఇస్తానని తెలిపాడు. ఎందుకంటే శోభా హౌస్ లో చేసింది ఏమీ లేదు. ఆమెకి మొదటి నుంచి అదృష్టం కలసి వస్తోంది. 

Related Articles

46

కాబట్టే శోభా ఇన్నిరోజులు హౌస్ లో నెట్టుకురాగలిగింది అని అర్జున్ అన్నాడు.కెప్టెన్సీ టాస్క్ లో కానీ, ఇతర టాస్క్ లలో శోభాకి లక్ బాగా కలసి వచ్చింది. అంత మాట అనండంతో శోభా జీర్ణించుకోలేకపోయింది. 

56

ప్రియాంక దగ్గర శోభా శెట్టి కన్నీరు మున్నీరైంది. నేను చేసింది ఏమీలేదా ? నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు అంటూ ప్రియాంక, అమర్ వద్ద శోభా శెట్టి ఏడ్చేసింది. 

66

అయితే నెటిజన్లు కొందరు అర్జున్ చెప్పింది నిజమే అని ఆమె అదృష్టంతోనే హౌస్ లో ఉందని అంటున్నారు. గతంలో ఎలిమినేషన్స్ అప్పుడు శోభా స్థానంలో మరికొందరు బలవుతూ ఎలిమినేట్ అయ్యారని అంటున్నారు. మరికొందరు మాత్రం శోభా ట్యాలెంటెడ్ కంటెస్టెంట్ అని ఆమె హౌస్ లో ఎనెర్జిటిక్ గా యాక్టివ్ గా రాణిస్తోంది అని ప్రశంసిస్తున్నారు. 

Recommended Photos