బిగ్ బాస్ 4 లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది. ఆ మద్యన అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది.