అఖిల్ నువ్వు వర్జినా? మోనాల్-తేజులలో ఎవరు కావాలి?... బిగ్ బాస్ సెలబ్రిటీ షాకింగ్ ఆన్సర్స్!

Published : Aug 03, 2023, 05:41 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ ని ఫ్యాన్స్ అడగకూడని ప్రశ్నలు అడిగి అయోమయంలో పడేశారు. వ్యక్తిగత విషయాల ప్రస్తావన తేవడంతో కంగారుకు గురయ్యాడు. అయితే సమాధానాలు మాత్రం చెప్పాడు.   

PREV
16
అఖిల్ నువ్వు వర్జినా? మోనాల్-తేజులలో ఎవరు కావాలి?... బిగ్ బాస్ సెలబ్రిటీ షాకింగ్ ఆన్సర్స్!


బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో ఒకడైన అఖిల్ సార్థక్ భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. అఖిల్ యాటిట్యూడ్, బిహేవియర్ ఒక వర్గాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. టాప్ బ్యూటీగా హౌస్లో అడుగుపెట్టిన మోనాల్ మనసు దోచాడు. వీరిద్దరూ ప్రేమపక్షుల్లా హౌస్లో మెలిగారు. 
 

26


మధ్యలో మోనాల్ కోసం అభిజీత్ చాలా ట్రై చేశాడు. అప్పుడప్పుడు అభిజీత్ కి కూడా మోనాల్ దగ్గరవుతుందేమో అనిపించేది. ఒక దశకు వచ్చాక అభిజీత్ ని మోనాల్ పూర్తిగా అవైడ్ చేసింది. మోనాల్-అఖిల్ సీజన్ 4 లవ్ బర్డ్స్ గా అవతరించారు. అఖిల్ కోప్పడ్డా మోనాల్ కాంప్రమైజ్ అయ్యేది. అతని కోసం త్యాగాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. 

36

ఇక ఫైనల్ కి వెళ్లిన అఖిల్ రన్నర్ గా నిలిచాడు. అభిజీత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా అఖిల్ మోనాల్ ని వదల్లేదు. కొన్ని నెలలు తరచుగా కలిసి కనిపించారు. కారణం తెలియదు ఎందుకో క్రమేణా దూరమయ్యారు. ఈ మధ్య అఖిల్ తేజస్వి మాదివాడకు దగ్గరయ్యాడు.

46
tejaswi madivada

ఇటీవల ముగిసిన బీబీ జోడీ కాంటెస్ట్ లో అఖిల్, తేజస్వి ఒక జంటగా పోటీ చేశారు. వీలైనంత వరకు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆ షో చేసినప్పటి నుండి ఇద్దరికీ చనువు పెరిగింది. తరచుగా కలిసి కనిపిస్తున్నారు. టూర్స్ లో కూడా విహరిస్తున్నారు. అఖిల్ అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా కొన్ని క్రేజీ ప్రశ్నలు ఎదురయ్యాయి.

56
Akhil Sarthak

మీరు వర్జినా? అని ఒక నెటిజన్ అడిగాడు. ఈ ప్రశ్నకు అఖిల్ జేమ్స్ బాండ్ టైటిల్ వీడియో పెట్టాడు. అవునో కాదో స్పష్టంగా చెప్పలేదు. మరొక నెటిజన్... మోనాల్, తేజస్వినిలో మీకు ఎవరు కావాలి? అని అడగ్గా... ఇద్దరూ కాదు నేహా శెట్టి కావాలని కామెంట్ పెట్టాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

66
Akhil Sarthak

బిగ్ బాస్ ఓటీటీలో పార్టిసిపేట్ చేసిన అఖిల్ కి అక్కడ కూడా నిరాశ ఎదురైంది. నటి బిందు మాధవి గట్టి పోటీ ఇచ్చింది. ఆమెతో తరచుగా గొడవలు పడుతూ అఖిల్ నెగిటివ్ అయ్యాడు. ఫైనల్ లో వీరిద్దరే నిలిచారు. బిందు మాధవి టైటిల్ కొట్టింది. అఖిల్ మరోసారి రన్నర్ గా మిగిలిపోయాడు.

Read more Photos on
click me!

Recommended Stories