Horror Movies: ఈ హారర్ సినిమాలు ఒంటరిగా చూసే దమ్ముందా? అయితే ఈ మలయాళ సినిమాలు మీకోసమే!

Published : Oct 16, 2026, 02:05 PM IST

Horror Movies: మీరు హారర్ సినిమాల ఫ్యాన్సా? అయితే భయంతో వణికించే బెస్ట్ మలయాళ సినిమాల లిస్ట్ ఇక్కడుంది. ఇందులో కొన్ని భయపెడుతూనే నవ్విస్తే, మరికొన్ని మాత్రం గుండెల్లో దడ పుట్టిస్తాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేయండి.

PREV
13
భూతకాలం

రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేసిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ 'భూతకాలం'. షేన్ నిగమ్, రేవతి ఇందులో నటించారు. డిప్రెషన్ బ్యాక్‌డ్రాప్‌లో తల్లీకొడుకుల బంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రియలిస్టిక్ సీన్స్, సౌండ్ డిజైన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ మనకు చెమటలు పట్టిస్తాయి.

23
ఎజ్రా

జయకృష్ణన్ డైరెక్షన్‌లో పృథ్వీరాజ్, ప్రియా ఆనంద్ నటించిన హారర్ సినిమా ఇది. ప్రియా, ఆమె భర్త రంజన్ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఒకరోజు షాపింగ్ చేస్తూ ప్రియా ఓ పురాతన పెట్టెను ఇంటికి తెస్తుంది. ఆ తర్వాత వాళ్ల జీవితంలో భయంకరమైన సంఘటనలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నెల్లికంపొయిల్ నైట్ రైడర్స్

ఇదొక మలయాళ హారర్-కామెడీ సినిమా. ఒక ఊరు, రాత్రిపూట తిరిగే స్నేహితుల గ్రూప్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇందులో హారర్, రొమాన్స్, జానపద కథల కలయిక ఉంటుంది. నౌఫల్ అబ్దుల్లా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాథ్యూ థామస్ లీడ్ రోల్ చేశాడు.

33
భ్రమయుగం

'భ్రమయుగం' ఒక మలయాళ హారర్ సినిమా. ఇందులో మమ్ముట్టి 'కొడుమోన్ పొట్టి' అనే దుష్ట మాంత్రికుడి పాత్రలో నటించగా, అర్జున్ అశోకన్ కీలక పాత్ర పోషించాడు. రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 17వ శతాబ్దపు మలబార్ ప్రాంతంలోని జానపద కథలు, చేతబడుల నేపథ్యంలో సాగుతుంది.

ప్రకంబనం

2026 జనవరిలో రిలీజ్ అయిన మలయాళ హారర్-కామెడీ సినిమా 'ప్రకంబనం'. హాస్టల్‌లో ఉండే స్నేహితుల గ్రూప్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విజేష్ పనతూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాగర్ సూర్య, మల్లికా సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories