పెళ్లి కోసం సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా? షాక్ అవ్వాల్సిందే!

First Published | Feb 6, 2023, 3:16 PM IST

బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ పెళ్లి  ఇవ్వాళ ఘనంగా జరుగుతోందని తెలుస్తోంది రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుకలకు కోట్లల్లో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. 
 

బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అద్వానీ  (Kiara Advani) చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేళలకు వీరిద్దరూ ఈరోజుతో పెళ్లి అనే పవిత్ర బంధంలోకి అడుగుపెడుతున్నారనే వార్తలతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.  
 

మూడురోజుల పాటు  ( ఫిబ్రవరి 4, 5, 6)  వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెహందీ, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ హోటల్‌ లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. 
 


అయితే వీరి పెళ్లికి రూ. కోట్లట్లో ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ముంబైకి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. వీరి మ్యారేజ్ కు ఒక్కరోజుకే రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని టాక్ వినిపిస్తోంది.
 

ఇక మూడు రోజుల పాటు జరుగుతున్న స్టార్ వెడ్డింగ్ కు రూ.6 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. వీరి వివాహానికి సినీ తారలతో పాటు ప్రముఖులు కూడా హాజరవుతుండటంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదని తెలుస్తోంది. అతిథుల కోసం ఏకంగా 70కి పైగా లగ్జీ కార్లను కూడా అందుబాటులో ఉంచారంట. 
 

బాలీవుడ్ స్టార్స్ రాయల్ వెడ్డింగ్ కు ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు జరిగిన ఖరీదైన వివాహ వేడుకల్లో సిద్ధార్థ్ - కియారా పెళ్లి కూడా ఒకటిగా నిలిచిపోనుందని అంటున్నారు. ఇక  వీరి వెడ్డింగ్ కు  సంబంధించిన అఫిషీయల్ అప్డేట్ రావాల్సి ఉంది. 
 

ఇప్పటికే ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆయన భార్య మీరా, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా తదితరులు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక సిద్ధార్థ్ నటించిన ‘మిషన్ మజ్ను’ జనవరి 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కియారా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ఆర్సీ15’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!