విడిపోవడంపై వస్తున్న విమర్శలకు ఏఆర్ రెహమాన్ స్పందన
సైరా బానుతో విడిపోవడంపై వస్తున్న విమర్శలపై ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఈ విషయంపై మాట్లాడారు.
“ప్రజా జీవితంలో ఉండటం అనేది మనం ఎంచుకున్న ఎంపిక కాబట్టి ప్రతి ఒక్కరూ మన గురించి తెలసుకోవాలని అనుకుంటారు. సెలబ్రిటీలుగా ఉన్న ధనికుల నుండి దేవుడి వరకు అందరూ సమీక్షించబడతారు. విమర్శించేవారు కాని, సలహాలు ఇచ్చేవారు కాని ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఉన్పప్పుడు వారు కూడా మన కుటుంబ సభ్యులే అని రెహమాన్ అన్నారు.
ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై రెహమాన్ స్పందన
తన భార్యతో విడిపోవడం చుట్టూ ఉన్న నెగెటివిటీ గురించి రెహమాన్ అంగీకరించారు, కానీ తమ ఇబ్బందుల గురించి కూడా ఆలోచించాలని ఆయన అన్నారు. కర్మ యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన మాట్లాడారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వల్ల తిరిగి అదే తమకు రివర్స్ అవుతుందని అన్నారు. . ప్రతి ఒక్కరికీ తల్లి, చెల్లి, భార్య ఉంటారని, ఒకరిపై విమర్శలు చేేసేముందు ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాని ఆయన అన్నారు.
ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ, రెహమాన్ ప్రశాంతంగా స్పందించారు, “నేను వేరే వారి కుటుంబం గురించి చెబితే, వేరొకరు నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడుతారు. భారతీయులుగా మనం దీన్ని నమ్ముతాం. ప్రతి ఒక్కరికీ సోదరి, భార్య, తల్లి ఉంటారు కాబట్టి ఎవరూ అనవసరమైన విషయాలు చెప్పకూడదు. ఎవరైనా బాధాకరమైనది చెప్పినప్పుడు కూడా, ‘దేవా, వారిని క్షమించి, వారికి మార్గనిర్దేశం చేయి’ అని నేను ప్రార్థిస్తాను. అని ఆయన అన్నారు.
విడిపోవడంపై సైరా బాను ప్రకటన
రెహమాన్ సైరా బాను విడిపోవడానికి గోడవలు కారణం కాదు, ఎమోషనల్ ప్రెజర్ కారణంగానే ఇలా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో తమ గోప్యతను, గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. మార్చి 2025లో, రెహమాన్ ఆసుపత్రిలో చేరిన తర్వాత, వారు అధికారికంగా విడాకులు తీసుకోలేదని, వ్యక్తిగత సవాళ్ల కారణంగా విడిగా సమయం గడుపుతున్నామని సైరభాను కూడా ఓ సందర్భంలో చెప్పారు. . తమ విడిపోయినప్పటికీ బంధం చెక్కుచెదరకుండా ఉందని చెబుతూ, తనను రెహమాన్ మాజీ భార్యగా పిలవద్దని ఆమె ఓ సందర్భంలో కోరారు.