బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో భాగంగా ఆదివారం రోజు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఐదుగురు వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కి కొత్త జోష్ తీసుకువచ్చేందుకు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపారు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగింది. హౌస్ లోకి బుల్లితెర నటుడు శివ కుమార్, నటి దక్షి గుత్తికొండ, డ్యాన్సర్ నీతూ నటరాజ్, డ్యాన్సర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ రామకృష్ణ ఎంట్రీ ఇచ్చారు.
24
షాలినికి చుక్కలు
ప్రతి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చే సమయంలో.. హౌస్ లో ఎవరిని టార్గెట్ చేస్తారు అని నాగార్జున ప్రశ్నించారు. ఐదుగురి నుంచి ఒక కామన్ ఆన్సర్ వచ్చింది. అదేంటంటే అందరూ షాలినిని టార్గెట్ చేస్తామని చెప్పారు. దానికి కారణం కూడా చెప్పారు. షాలిని గేమ్ కంటే మరో విషయంపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది అని అన్నారు.
34
అపూర్వ అవుట్
షాలిని దృష్టంతా రోహిత్ తో రిలేషన్ పైనే ఉంది అని అన్నారు. గేమ్ లో ఆమె వాయిస్ బలంగా వినిపిస్తోంది కానీ గేమ్ మాత్రం ఆడడం లేదు. ఆమె ఒక్క గేమ్ కూడా గెలవలేదు అని ఆరోపించారు. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఆదివారం రోజు ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ముందుగా అపూర్వ ఎలిమినేట్ అయింది. వెళుతూ వెళుతూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను షాలిని, రోహిత్ మధ్యలో దూరాలి అని ఏమాత్రం అనుకోలేదు అని పేర్కొంది.
ఇక హౌస్ లోకి ఆల్రెడీ ఎలిమినేట్ అయి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. రెండు సార్లు ఛాన్స్ వచ్చినా చరణ్ గేమ్ ఆడడంలో వెనుకబడిపోయాడు. డేంజర్ జోన్ లో చివరి వరకు షాలిని, చరణ్ ఉన్నారు. వీరిలో ఎవరైతే హౌస్ లో కొనసాగాలి అని అనుకుంటున్నారో వాళ్లకు ఓట్ వేయమని నాగార్జున అడిగారు. అన్ని ఓట్లు షాలినికే పడ్డాయి. చరణ్ కి కేవలం ఒక్క ఓటు మాత్రమే దక్కింది. దీనితో చరణ్ ఎలిమినేట్ అయ్యారు.