`వకీల్‌సాబ్‌`పై ఏపీ సర్కార్ బాంబ్‌.. టాలీవుడ్‌ దుకాణం సర్దుకోవాల్సిందేనా ?

First Published Apr 15, 2021, 8:55 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమపై మరో దెబ్బ పడింది. ఓ వైపు కరోనా కారణంగా థియేటర్లకు జనం రావడం కష్టంగా మారుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టికెట్లు రేట్లు తగ్గించడం థియేటర్లని కుదేలు చేస్తుంది. `వకీల్‌సాబ్‌`పై ఏపీ ప్రభుత్వం బాంబ్‌, ఇప్పుడు టాలీవుడ్‌ దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

కరోనా విలయతాండవం సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్‌ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడు టాలీవుడ్‌ కుదుటపడుతోంది. `క్రాక్‌` సినిమాతో మొదలైన థియేటర్ల సందడి ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` వరకు కొనసాగింది. `ఉప్పెన`, `వకీల్‌సాబ్‌` సినిమాలు జనాలను థియేటర్లకి రప్పించాయి. మళ్లీ థియేటర్లకి, టాలీవుడ్‌కి పూర్వవైభవం వచ్చిందని అంతా సంతోషిస్తున్నారు. నిర్మాతలు, థియేటర్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.
undefined
ఇంతలో పిడుగులాంటి వార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో జారీ చేసింది. `వకీల్‌సాబ్‌`కి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా, దాన్ని మూడు రోజులకే పరిమితం చేసింది. పవన్‌పై ఉన్న కక్ష్యతో ఆ సినిమాకి బెనిఫిట్‌ షోలు రద్దు చేసిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా తగ్గించడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతలపై పుండుమీద కారం చల్లినట్టయ్యింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని భావించినా తాజా ఏపీ ప్రభుత్వం నిర్ణయం పెద్ద షాక్‌ ఇస్తుంది. `వకీల్‌సాబ్‌` వల్లే ఇది జరిగిందని అంటున్నారు.
undefined
ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించడం సరైన నిర్ణయం కాదనే టాక్‌ విమర్శకుల నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జనం కొనుగోలు శక్తి ఎక్కువగానే ఉంటుంది. పైగా సినిమాలు చూసే ఆసక్తి ఎక్కువే. అందుకే సినిమాల కోసం ఓ మోస్తారు రేట్లు పెట్టిందుకు వాళ్లు సిద్ధంగానే ఉంటారని, ప్రస్తుతం ఉన్న రేట్లు ఎక్కువ కాదనే టాక్‌ వినిపిస్తుంది. అయితే టికెట్ల తగ్గింపు జనానికి వెసులుబాటే అనే మరో వాదన కూడా వినిపిస్తుంది.
undefined
ఇదిలా ఉంటే ఏపీలో మండల స్థాయిలో, పెద్ద గ్రామం స్థాయిలో థియేటర్లు ఉంటాయి. ఒక సినిమా ఎక్కువ రోజుల రన్నింగ్‌ అక్కడ ఉండదు. పైగా ఇప్పుడు అన్ని థియేటర్లు శాటిలైట్‌ చేసుకోవాల్సి వస్తుంది. శాటిలైట్‌ ప్రొజెక్టర్‌ కావడంతో థియేటర్లని ఆధునీకరిస్తున్నారు. గ్రామాల స్థాయిలో, మండలాల స్థాయిలో ఉన్న థియేటర్లు కూడా ఏసీలుగా మారుస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా థియేటర్లని కూడా మార్చాల్సి వస్తుంది. ఇది ఎగ్జిబిటర్ కి పెద్ద దెబ్బే. అయినా మనుగుడ సాగించాలంటే అలా మార్చక తప్పదు. ఈ క్రమంలో చాలా మంది ఎగ్జిబిటర్లు థియేటర్లను మూసుకుంటున్నారు. మరికొందరు ఎంతో కొంత అని బడా నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు లీజుకిస్తున్నారు.
undefined
ఇప్పుడు లీజుదారులైనా వాటిని ఆధునీకరించాల్సిన పరిస్థితి. దానికి బోలెడంతా ఖర్చు చేయాల్సి వస్తుంది. వాటిని రాబట్టాలంటే సినిమాలు బాగా ఆడాలి. టికెట్లు రేట్లు ఎక్కువగానే ఉండాలి. కానీ అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అటు ఆధునీకరిస్తున్న ఎగ్జిబిటర్లకి, లీజుదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. థియేటర్ల నుంచి వచ్చే కలెక్షన్ల రూపంలోనే వారికి సినిమా కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి రావాలి. సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్మినా వచ్చే లాభంలో ఎగ్జిబిటర్ కి ఏమీ ఉండదు. థియేటర్ ఉద్యోగులకు జీతాలిచ్చి మెయింటెయిన్ చేసేదానికే ఎక్కువగా అయిపోతోంది. కరెంట్ బిల్లులు వగైరా తడిసిమోపెడు అవుతుంటాయి. ఇక మహమ్మారీ కష్టకాలంలో ఇది మరింతగా నష్టాన్ని కలగజేసింది.
undefined
`వకీల్ సాబ్` టికెట్ ధరల్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకంగా పదేళ్ల నాటి టిక్కెట్టు ధరల్ని నిర్ణయించారు. దీంతో థియేటర్ యజమానులు లబోదిబోమనాల్సిన పరిస్థితి నెలకొంది. `వకీల్ సాబ్` కి హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చినా తమ పెట్టుబడులు తిరిగి రావడం లేదని ప్రదర్శనకారులు చెబుతున్నారు. వచ్చే లాభంలో ఎక్కువ వాటా హీరోకే వెళుతుందని నివేదిస్తున్నారు. వాస్తవానికి ఎగ్జిబిషన్ రంగం చాలా కాలంగా చిక్కుల్లో ఉంది. పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్టు గత కొన్నేళ్లలో కోట్లాది రూపాయల్ని థియేటర్ల అధునాతన సాంకేతికత (డీటీఎస్ ప్రొజెక్షన్ వగైరా) కోసమే ఖర్చు చేసినవాళ్లు ఉన్నారు. ఆ ఖర్చులన్నీ ఇప్పుడు రాబట్టుకోవాలి. కానీ ఇంతలోనే ఏపీ ప్రభుత్వం టిక్కెట్టు రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. వకీల్ సాబ్ పై కక్షపూరితంగా వ్యవహరించడం వల్లనే ఈ నిర్ణయం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
undefined
ఇదిలా ఉంటే టికెట్ల రేట్లు తగ్గించడంతో నిర్మాతలు కూడా సినిమాలు విడుదలలు నిలిపివేస్తున్నారు. ఇటీవల నాని నటించిన `టక్‌ జగదీష్‌` సినిమా వాయిదాకి టికెట్ల రేట్లు తగ్గించడమే అనే వాదన కూడా వినిపిస్తుంది. `విరాటపర్వం`, వచ్చే నెలలో రావాల్సిన `ఆచార్య`, `నారప్ప` చిత్రాలు సైతం వాయిదా పడబోతున్నాయని అంటున్నారు. ఇది నిర్మాతలపై మరింత భారం పడేలా ఉందని, వారికి మరింత నష్టాల్లోకి నెట్టేలా ఉందంటున్నారు. ఎందుకంటే నిర్మాత సినిమా తీయాలంటే ఫైనాన్స్ తీసుకొస్తాడు. ఫైనాన్స్ వడ్డీలు చాలా భారీగా ఉంటాయి. వచ్చిన కలెక్షన్లతో వాటిని చెల్లించి మిగిలిన డబ్బులు లాభాల్లోకి వేసుకుంటాడు.
undefined
సినిమా హిట్‌ అయితేనే వడ్డీలు, సినిమా బడ్జెట్‌లు, ఇతర ఖర్చులు అన్నీ పోను మిగలడం కష్టం. అలాంటిది ఇలా సినిమాలు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటే అది నిర్మాతకి మరింత భారమయ్యే ఛాన్స్ ఉంది. ఇదే విషయాన్ని నిర్మాతలు చెబుతూ ఆవేదన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని, టికెట్ల రేట్లు యదాతథం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో వారు మరోసారి కోర్ట్ కి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
undefined
కరోనాతోనే కుదేలవుతున్న చిత్ర పరిశ్రమకి ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి, ఇలా రేట్లు తగ్గించి మరింత నష్టాల్లో కూరుకుపోయేలా చేయడమేంటేని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు బయటకు మాట్లాడలేకపోయినా లోలోపల పిసుక్కుంటున్నారని టాలీవుడ్‌ టాక్‌. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని అంటున్నారు. అయితే ఇదంతా `వకీల్‌సాబ్‌` ఎఫెక్ట్ అని, కొన్ని రోజులపాటే ఇలా ఉంటుందని, ఆ తర్వాత తిరిగి యదాతథ స్థితి వస్తుందని, అందుకే దీనిపై ఎవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది. కానీ ఇదే కొనసాగితే ఎగ్జిబిటర్లుగా ఉన్న బడా నిర్మాతలు ఏపీలో థియేటర్లు మూసేసే అవకాశాలున్నాయనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తంగా టికెట్ల రేట్లు తగ్గించడం చిత్ర పరిశ్రమకి తీరని నష్టమనే వాదన బలంగా వినిపిస్తుంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా? అలానే ముందుకెళ్తుందా? అన్నది వేచి చూడాలి.
undefined
click me!