అనుష్క కెరీర్ లో అరుంధతి చిత్రం ఒక మైల్ స్టోన్ మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో అనుష్క, సోను సూద్ పోటీ పడి నటించారు. అనుష్కని అయితే డైరెక్టర్ కోడి రామకృష్ణ పవర్ ఫుల్ గా ఒక సూపర్ వుమెన్ లాగా చూపించారు.