మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సత్తా చాటింది. తెర మీద పాలరాతి శిల్పం లా అదిరిపోయే ఈ బ్యూటీ వయసు 30 ఏళ్లు అంటే నమ్మలేం. ఈ బ్యూటీ మేకప్ లేకుండా కూడా అంతే అందంగా ఉంటుంది.
మలయాళీ కుటుంబానికి చెంది ముద్దుగుమ్మ అసిన్. ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్‌లోసెటిల్ అయిన ఈ బ్యూటీ మేకప్ లేకుండా కూాడా అంతే అందంగా ఉంటుంది.
సాధారణంగా హీరోయిన్లు మేకప్ లేకుండా అభిమానులకు కనిపించేందుకు పెద్ద ఇష్టపడరు. కానీ అందాల భామ కాజల్ అగర్వాల్ మాత్రం రిస్క్ చేసింది. తను మేకప్ లేకుండా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
తెర మీద దేవసేన రాకుమారిలా కనిపించే అనుష్క శెట్టి, తెర వెనుక మాత్రం అంత గ్లామరస్‌గా ఉండదు. అనుష్క మేకప్ లేని ఫోటోలు చాలా సందర్భాల్లో అభిమానులను ఇబ్బంది పెట్టాయి.
తెర మీద మేకప్‌తో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో.. మేకప్ లేని లుక్‌తోనూ అదే రేంజ్‌లో హడావిడి చేస్తుంది సమంత. తాను మేకప్ లేకుండా ఇంట్లో ఉన్న సమయంలో ఉన్న ఫోటోలను తరుచూ సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తుంటుంది సమంత.
టాలీవుడ్ నయా సెన్సేషన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. గ్లామర్ కన్నా పర్ఫామెన్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టే ఈ బ్యూటీ తరుచూ తాను మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తుంటుంది.
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా ఓ రేంజ్‌లో అలరిస్తోంది. అయితే ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తీసిన ఫోటోలు చూస్తే అసలు గుర్తు పట్టలేం. ఏ మాత్రం అందంగా లేని నయనతార ఫోటోలు తరుచూ వార్తల్లో నిలుస్తుంటాయి.