సినిమా పరిశ్రమలో సక్సెస్ కి ఉన్న వేల్యూఅంతా ఇంతా కాదు. ఓ హీరోయిన్ నటిస్తున్న ప్రతి సినిమా హిట్ కొడుతుంది అనుకుంటే నిర్మాతలు, స్టార్ హీరోలు ఆమె వెంటపడతారు. అలాంటి హీరోయిన్స్ లో రష్మిక మందానఒకరు. ఏళ్ళ తరబడి తపస్సు చేసినాదొరకని ఛాన్సులుఈ అమ్మడు కేవలం రెండేళ్లలోనే పట్టేసింది, మహేష్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
2018లో నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన రష్మిక మొదటి చిత్రంతోనే హిట్ కొట్టింది. ఇక రెండో చిత్రం గీత గోవిందంతో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె నటించినసరిలేరు నీకెవ్వరుబ్లాక్ బస్టర్కాగా, భీష్మ సూపర్హిట్ కొట్టింది.
ఆమె నటించినదేవదాసు, డియర్ కామ్రేడ్ మాత్రమే యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి ఈ స్థాయిలో హిట్ పర్సెంటేజ్ ఉంటేనిర్మాతలుఊరుకుంటారా...వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. అందుకే సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ అల్లు అర్జున్ పక్కన పుష్ప మూవీ కోసం తీసుకున్నారు.
పుష్ప మూవీలో రష్మిక పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అలాగే పుష్పపాన్ ఇండియా మూవీగాపలు భాషలలో విడుదల కానుంది. దీనితో పుష్ప చిత్రంతోరష్మిక బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తుంది. ఐతే రష్మిక హీరోయిన్ కాకముందు సినిమా అంటే అదో కొత్త ప్రపంచం అనుకునేదట.
చదువుకునే రోజులల్లో రష్మిక ఓ మూవీ షూటింగ్ చూస్తే చాలు అనుకుందట. ఫ్రెష్ పేస్ అనే ఓ టీవీ కార్యక్రమంలోపాల్గొన్నఆమె మొదటిసారిహీరో ఉపేంద్ర, కృతి కర్బందలను చూశారట. ఆమె చూసిన మొదటి స్టార్ హీరో ఉపేంద్ర అని ఆమె చెప్పారు.ఆతరువాత ముంబై వెళ్ళినప్పుడుఅక్షయ్ కుమార్ ని చూశారట. అలా స్టార్ హీరోలతో తనకు గల మొదటి అనుభవాన్ని రష్మిక చెప్పింది.