మహా శివరాత్రి ఉత్సవాల్లో అనుష్క.. ఇలా మారింది ఏంటి, లేటెస్ట్ లుక్ కి షాక్ లో నెటిజన్లు

Published : Feb 19, 2023, 09:38 AM IST

లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. 

PREV
16
మహా శివరాత్రి ఉత్సవాల్లో అనుష్క.. ఇలా మారింది ఏంటి, లేటెస్ట్ లుక్ కి షాక్ లో నెటిజన్లు

లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. అనుష్క బరువుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటోంది. దీనితో అనుష్క ఎక్కువ చిత్రాల్లో నటించేందుకు వీలు కావడం లేదు. 

26

ప్రస్తుతం అనుష్క్ శెట్టి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు. బయట కనిపించడం కూడా చాలా తక్కువ. గత కోనేళ్ళుగా అనుష్క దర్శనమే ఫ్యాన్స్ కి కరువుగా మారింది. 

36

నిన్న మహా శివరాత్రి సందర్భంగా అనుష్క బెంగుళూరులో ఒక శివాలయంలో కనిపించింది. మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుష్క అక్కడికి వచ్చింది. చాలా కలం తర్వాత అనుష్కని చూస్తున్న ఫ్యాన్స్ కి ఆమె లుక్ షాకింగ్ గా మారింది. అనుష్క బాగా బొద్దుగా మారి కనిపిస్తోంది. ట్రెడిషనల్ గా వైట్ చుడిదార్ లో అనుష్క అక్కడ భక్తి శ్రద్దలతో కనిపించింది. 

46

దీనితో అనుష్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుష్క అందం చెక్కు చెదరనప్పటికీ ఆమె బొద్దుగా మారడమే సమస్యగా మారింది అని నెటిజన్లు అంటున్నారు. అందుకే అనుష్క సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గించింది. 

56

బాహుబలి తర్వాత నుంచి అనుష్క బరువు సమస్యలు ఎదుర్కొంటోంది. విదేశాల్లో ట్రీట్మెంట్ కూడా ట్రై చేసింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది ఫలితం ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత అనుష్క కనిపించడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

66

సౌత్ లో అనుష్క స్టార్ హీరోలకు ధీటుగా ఇమేజ్ సొంతం చేసుకుంది. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలికిస్తూనే సోలో హీరోయిన్ గా కూడా అద్భుతమైన విజయాలు అందుకుంది. అనుష్క ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి చిత్రంలో ఆమె లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories