మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం.. చేతికి గాయంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత ఫోటో వైరల్..

Published : Feb 19, 2023, 08:33 AM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే..? ఆయన ఆ విషయంలో ఎన్నో ఘనతలు సాధించారు. ఈక్రమంలో పవర్ స్టార్ కు సబంధించిన ఓ మార్షల్ ఆర్ట్స్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   

PREV
15
మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం.. చేతికి గాయంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత ఫోటో వైరల్..

పవన్ కళ్యాణ్ పేరు కొన్నేళ్ల ముందు వరకూ.. కళ్యాణ్ బాబు అని మాత్రమే ఉండేదట. దానికి ముందు పవన్ అనేది తరువాత వచ్చి చేరిందట దానికోసం కూడా ఓ కథ ఉన్నట్టు తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్ లో తన ప్రతిభ చూసిన ఇండయన్ కరాటే అసోసియోషన్ వారు కల్యాణ్ బాబుకు పవన్ అనే బిరుదు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అయ్యాడని తెలుస్తోంది. 

25

చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత టాలెంట్ తో.. పవర్ స్టార్ గా ఎదిగాడు కళ్యాణ్ బాబు. అంతే కాదు మెగాస్టార్ ను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించాడు పవన్ కళ్యాణ్. మూవీ కెరీర్ బిగినింగ్ లో తమ్ముడు, జానీ లాంటి సినిమాల్లో బాక్సింగ్‌తో ఆకట్టుకున్న పవన్ .. మార్షల్ ఆర్ట్స్ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. 

35

ఇక రీసెంట్ గా పవర్ స్టార్..  సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన ఇచ్చినప్పటి రేర్ పిక్ ఒకటి సోషల్  మీడియాలో  వైరల్ అవుతోంది..  అంతే కాదు ఆ ఫోటోలో పవన్ చేతికి రక్తం కారుతూ ఉంది.. ఈ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలోవ తెగ వైరల్ అవుతోంది. 

45

ఇక ప్రస్తుతం చాలా కాలం తరువాత తన మార్షల్ ప్రదర్శన ఇవ్వబోతుననాడు పవన్ కళ్యాణ్. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఈ టెక్నిక్స్ ను వాడబోతున్నాడు. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు పవన్. 

55

ప్రస్తుతం సినిమాలు , రాజకీయాలు,  రెండీటిని బ్యాలన్స్ చేస్తూ.. ముందుకు సాగుతున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పవర్ స్టార్.. ప్రస్తుతం హారిహరవీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో ఒక మూవీ లైన్ లో ఉంది. ఆతరువాత సినిమాలపై ఇంకా క్లారిటీ రాలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories