Tamannah Bhatia
స్లీవ్ లెస్ బ్లౌజ్, డిజైనర్ శారీ ధరించిన తమన్నా లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ నెటిజెన్స్ గుండెల్లో సెగలు రేపింది. అమ్మడుకు కిల్లింగ్ లుక్స్ కునుకు దూరం చేసేలా ఉంది. పైట పక్కకు జరిపి ఎద అందాలతో విందు చేసింది. తమన్నా ఫోటో షూట్ వైరల్ అవుతుండగా ఆమె గ్లామర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tamannah Bhatia
ఇక తమన్నా కెరీర్ విజయవంతంగా సాగుతుంది. స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయినా కూడా కొన్ని క్రేజీ ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. ఇటీవల విడుదలైన జైలర్ మూవీతో తమన్నా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకున్నా కెరీర్లో ఫస్ట్ టైం రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కింది.
Tamannah Bhatia
జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీలో భాగమయ్యారు. తమన్నా జైలర్ మూవీలో తన నిజ జీవిత పాత్ర అయిన హీరోయిన్ గా చేయడం విశేషం.
Tamannah Bhatia
అలాగే చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేసింది. జైలర్, భోళా శంకర్ ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. ఆగస్టు 11న రిలీజ్ అయిన భోళా శంకర్ డిజాస్టర్ అయ్యింది. భారీ నష్టాలు మిగిల్చింది. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. చిరంజీవి కెరీర్లో చెత్త సినిమాగా మిగిలిపోయింది. చిరంజీవితో తమన్నాకు భోళా శంకర్ రెండో చిత్రం. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా-చిరంజీవితో జతకట్టారు.
Tamannah Bhatia
ఇక రెండు దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం కొనసాగుతుంది. గత ఏడాది తమన్నా పలు చిత్రాల్లో నటించారు. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాలు చేశారు. సత్యదేవ్ కి జంటగా చేసిన గుర్తుందా శీతాకాలం ఆడలేదు.
Tamannah Bhatia
తమన్నాకు హ్యాపీడేస్ ఫేమ్ తెచ్చింది. 100 % లవ్ చిత్రంతో పరిశ్రమలో నిలదొక్కుకుంది. రెండు తరాల టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇటీవల వెబ్ సిరీస్లలో దుమ్మురేపుతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ సిరీస్లలో తమన్నా బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించారు.
Tamannah Bhatia
ఈ రోజుల్లో కూడా జనాలు బోల్డ్ సన్నివేశాల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదం. పాత్ర డిమాండ్ చేస్తే తప్పదని తమన్నా అంటున్నారు. కాగా తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. విజయ్ వర్మ చాలా కేరింగ్ పర్సన్, నాకు భద్రత కల్పిస్తాడనే భరోసా ఉంది. అందుకే ప్రేమించానని తమన్నా చెప్పుకొచ్చారు.
Tamannah Bhatia
విజయ్ వర్మను ప్రేమిస్తున్న తమన్నా పెళ్ళికి మాత్రం ఇంకా సమయం ఉందంటుంది. అప్పుడే ఆ ఆలోచన లేదంటుంది. ఈ క్రమంలో తమన్నా-విజయ్ వర్మ బంధం పెళ్లి వరకు వెళుతుందా అనే సందేహం కలుగుతుంది.