Anupama Parameswaran :క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తున్న కేరళ కుట్టి ‘అనుపమా పరమేశ్వరన్’

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 06, 2022, 04:51 PM ISTUpdated : Feb 06, 2022, 04:56 PM IST

అనుపమ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది అనుపమలో వచ్చిన ఈ ఛేంజ్ అందరిని షాక్ కు గురిచేస్తోంది. మరోవైపు వరుస ఫొటోషూట్లతో ఈ అమ్మడు కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది.  

PREV
16
Anupama Parameswaran :క్యూట్ లుక్స్ తో  కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తున్న కేరళ కుట్టి ‘అనుపమా పరమేశ్వరన్’

తెలుగులో వరుస సినిమాలతో సందడి చేస్తోంది కేరళ కుట్టి ‘అనుపమా పరమేశ్వరన్’ (Anupama Parameshwaran). అటు సినిమాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ గ్లామర్ షో స్థాయిని రోజురోజుకు పెంచుతోందీ ఈ  మలయాళ బ్యూటీ.  
 

26

మొన్నటి వరకు హోమ్లీ రోల్స్ చేసిన అమ్మడు, కొంచెం హద్దులు మీరి బోల్డ్ సీన్స్ చేసేందుకు ముందుకు వస్తోంది. మతిపోయేలా  లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తోంది. ఇటీవల వచ్చిన ‘రౌడీ బాయ్స్’ మూవీలో తను కొన్ని బోల్డ్ సీన్లలో నటించి రెచ్చిపోయింది.
 

36

రౌడీ బాయ్స్ హీరో ఆశీష్ తో కలిసి రోమాన్స్ లో బౌండరీలు దాటింది ఈ సుందరి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత తన గురించి పెద్ద ఎత్తునే సోషల్ మీడియాలో చర్చ సాగింది. దీంతో అనుపమ పరమేశ్వర్ ను  కొంత క్రేజ్ దక్కించుకుంది.   
 

46

ప్రస్తుతం అనుపమా పోస్ట చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటోందీ బ్యూటీ. క్లోజ్ అప్ లో ఫేస్ ఎక్స్ ప్రేషన్స్ తో నెటిజన్లను తలతిప్పుకోకుండా చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన పలువురు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

56

మొన్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ చేసిన బేబీ బౌన్స్ ఫోటోలు వైరల్ గా మారాయి. పెళ్లి కాని 25ఏళ్ల అనుపమ గర్భవతి ఎప్పుడయ్యిందని అందరూ షాక్ తిన్నారు. అయితే గతంలో సరదాగా ఇంట్లో గర్భవతి గెటప్ వేసిన అనుపమ, అప్పటి ఫోటోలను మళ్లీ షేర్ చేసింది. అంతకు మించి ఆ ఫొటో వెనకున్న రహస్యం నాకేమీ తెలియదంటూ ఫన్నీ కామెంట్ చేసింది.

66

అనుపమ చేతిలో మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలలో నటిస్తున్నారు. అలాగే హెలెన్ టైటిల్ తో తెరకెక్కుతున్న మరో చిత్రం చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. నిఖిల్ కార్తికేయ 2 మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఈ చిత్రాల విజయంపైనే అనుపమ కెరీర్ ఆధారపడి ఉంది.  
 

click me!

Recommended Stories