ఫ్యామిలీ వెకేషన్ లో అనుపమా అల్లరే అల్లరి.. టైట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ క్యూట్ స్టిల్స్

First Published | Nov 1, 2023, 5:39 PM IST

క్రేజీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ సోషల్ మీడియాలో సందడి సందడి చేస్తోంది. తాజాగా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. కిర్రాక్ స్టిల్స్ తో ఆకట్టుకుంది. 
 

యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ (Anupama Parameswaran)  తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే దక్కించుకుంది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూనే ఈ ముద్దుగుమ్మ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇఫ్పటికీ వరుస సినిమాలు చేస్తోంది. 
 

తెలుగులోనే కాకుండా ఇతర భాషా సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. గతేడాది ఈ ముద్దుగుమ్మ ఏకంగా నాలుగు చిత్రాలు ‘రౌడీ బాయ్స్’, ‘కార్తీకేయ 2’, ‘18 పేజెస్’, ‘బటర్ ఫ్లై’ వంటి సినిమాలతో అలరించింది. కార్తీకేయ 2తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 


సినిమాల పరంగా ఈ బ్యూటీ దూసుకుపోతుందనే చెప్పాలి. ఇదిలా ఉంటే అనుపమా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పుడూ ఫ్యామిలీతో గడుపుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. సమయం దొరికితే కుటుంబానికే కేటాయిస్తుంటుంది. 
 

ఇక తాజాగా అనుపమా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లింది. ప్రకృతి అందాల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేసింది. స్వచ్ఛమైన నేచర్ ను ఆస్వాదిస్తూ రిలాక్స్ అయ్యింది. అలాగే తన అల్లరి చేష్టలతోనూ ఆకట్టుకుంది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది.
 

లేటెస్ట్ గా అనుపమా పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీతో సరదాగా ఫోజులిచ్చి అట్రాక్ట్ చేసింది. మరోవైపు టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. స్లీవ్ లెస్ టాప్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. స్టన్నింగ్ లుక్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. 
 

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనుపమా స్టిల్స్ ను, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఇక అనుపమా తెలుగులో ‘టిల్లు స్క్వేర్’, ‘ఈగల్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో ‘సైరెన్’, మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది. 
 

Latest Videos

click me!