నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది. దేవుడితో లింక్ పెడుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కార్తికేయ విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.