Anupama Parameswaran : బ్లూ కలర్ డ్రెస్, కర్లింగ్ హెయిర్ లో అనుపమా పరమేశ్వరన్ స్టన్నింగ్ లుక్స్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 22, 2022, 08:23 PM IST

ఎప్పటికప్పుడు తన అందాలకు మెరుపులు అద్దుతూ .. కొత్త కొత్త ఫొటో షూట్స్ తో  అభిమానులను ఖుషీ చేస్తోంది అనుపమా పరమేశ్వరన్. ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియాలో సరికొత్త ఫొటో షూట్ తో దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ.   

PREV
16
Anupama Parameswaran : బ్లూ కలర్ డ్రెస్,  కర్లింగ్ హెయిర్ లో  అనుపమా పరమేశ్వరన్ స్టన్నింగ్ లుక్స్..

రౌడీ బాయ్స్ మూవీతో రీసెంట్ గా అలరించిన అనుపమ.  ఇటీవల వరుస ఫొటోలతో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా   తన ఫొటోలను అభిమానులతో పంచుకుంది ఈ సుందరి. 
 

26

టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస  సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా రౌడీబాయ్స్ తో తనదైన పాత్ర పోషించి అభిమానులను అలరించారు. దిల్ రాజు బ్యానర్ లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా హుషారు ఫేమ్ హర్ష కోనుగంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కొద్దిమేర అనుకూల ఫలితాలే ఇచ్చాయని టాక్ వస్తోంది.  కొత్త హీరో ఆషీశ్  సరసన అనుపమ నటించడంతో ఆడియోన్స్ ఈ సినిమాకు ఓటు వేస్తున్నారు.  
 

36

అయితే రీసెంట్ గా ‘రౌడీ బాయ్స్’(Rowdy Boys) మూవీతో తన అభినయంతో అనుపమ మరింత ఆకట్టుకోవడం ఒక్క అంశమైతే, ఈ సినిమాలో లిప్ లాక్ చేసి, అభిమానులను మరీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సీన్ తో యూత్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల ఈ మూవీ హిట్ చేసినందుకు ఓ కార్య్రకమంలో అనుపమ డ్యాన్స్ చేయడం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 

46

ఎక్కడ..  ఎలాంటి మూవీ ఫంక్షనైనా అనుపమ తన అభిమానులను తనదైన శైలిలో ఆకట్టుకుంటుంటారు. వేదికపై ఎంత మంది సినీ పెద్దలు ఉన్నా తాను చెప్పాలనుకుంది సూటిగా చెబుతుంది. పైగా తన అటిట్యూడ్ తో అందరి నుంచి  పొగడ్తలను కూడగట్టుకుంటోంది ఈ కేరళ కుట్టి.   
 

56

ఏదేమైనా అనుపమ అటూ సినిమాల్లో మెరుస్తూనే, ఇటూ సోషల్ మీడియాలో నూ తన క్రేజ్ తగ్గకుండా  చూసుకుంటోంది. తన అభిమానులను ఎప్పటికప్పుడు ఖుషీ చేసేందుకు, సరికొత్త ఫొటో షూట్ చేసి ఖుషీ చేస్తోంది. దీంతో నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. 
 

66

తాజాగా, తాను పోస్ట్ చేసిన ఫొటోల్లో అనుపమా చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. ఇటు తెలుగు తనాన్ని, అటూ ట్రెండీనెస్ ను కలుపుకొని బాపు బొమ్మలా మెరిసిపోంతోంది. అందం తన సొంతమవడం, అందుకు తగ్గట్టుుగా కాస్ట్యూమ్స్ ధరించడంతో అందానికే అందం వచ్చినట్టుంది అనుపమ. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ‘18 పేజేస్’, ‘కార్తీకేయ -2’, ‘హెలెన్’ వంటి తెలుగు సినిమాల్లో  ప్రధాన పాత్రలో పోషించనున్నారు.
 

click me!

Recommended Stories