నాకు ఇలాంటివి నచ్చవు సర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను. మరోవైపు నీరజ్ ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా తల్లికి చెప్తాడు. ఆ మాటలు విన్న శారదమ్మ ఆశ్చర్యానికి గురవుతుంది. ఇంతలో జెండే వచ్చి ఈ సమస్యలో నీరజ్ సర్ ఉండడం కన్నా ఆర్య ఉంటేనే త్వరగా బయటపడగలడు తనకి ఎలా బయటపడాలో తెలుసు కంగారు పడొద్దు అంతా మంచికే జరుగుతుంది అని అంటాడు. మరోవైపు నీరజ్, అంజలి కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. అంజలి పక్కనే ఉన్న అను విషయం తెలుసుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది.