మధ్యలో నువ్వు ఎవరివి మాట్లాడడానికి అంటూ పొగరుగా మాట్లాడుతుంది మాన్సీ. నీరజ్ కూడా దాదా ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ అంటాడు. ఇదే నీ డెసిషన్ అయితే నా డెసిషన్ కూడా విను అంటూ డాబా మీదకి వెళ్తుంది మాన్సీ. అప్పుడే అంజలి వచ్చి అందరూ ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతుంది. కిందికి వచ్చిన మాన్సి ఇవి డైవర్స్ పేపర్స్ నాకు ఇక్కడ గౌరవం లేదు అంటుంది. జెండే, అంజలి, శారదమ్మ ఎంత చెప్పినా వినిపించుకోదు. విసిగిపోయిన నీరజ్ వెళ్తే వెళ్ళు అని కోపంగా అంటాడు.