చిరంజీవి కూతురు శ్రీజ పై యాంటీ ఫ్యాన్స్ దాడి... స్పెషల్ డే రోజు ఏడిపించే కామెంట్స్!

Published : Dec 27, 2023, 08:14 AM IST

చిరంజీవి కూతురు శ్రీజ పోస్ట్ పై నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆమె కూతురు పుట్టినరోజు నాడు ఆనందాన్ని ఆవిరి చేశారు. యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ తో బాధపెటారు.    

PREV
18
చిరంజీవి కూతురు శ్రీజ పై యాంటీ ఫ్యాన్స్ దాడి... స్పెషల్ డే రోజు ఏడిపించే కామెంట్స్!


శ్రీజ కూతురు నవిష్క ఐదవ ఏట అడుగు పెట్టింది. పాపకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక అందమైన ఫోటోలు షేర్ చేసింది. ఈ క్రమంలో అభిమానులు నవిష్కకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. కొందరు మాత్రం శ్రీజ బాధపడే కామెంట్స్ చేశారు.
 

28
Sreeja Konidela

శ్రీజ పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. విషయంలోకి వెళితే... శ్రీజ భర్తకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రెండో వివాహంగా కళ్యాణ్ దేవ్ ని ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం అని సమాచారం. 2016లో శ్రీజ-కళ్యాణ్ దేవ్ పెళ్లి పీటలు ఎక్కారు. 
 

38
Sreeja

చిరంజీవి అల్లుడు హోదాలో కళ్యాణ్ దేవ్ హీరో అయ్యాడు. విజేత టైటిల్ తో తెరకెక్కిన చిత్రంతో అరంగేట్రం చేశాడు. కొన్నాళ్ళు వీరి కాపురంగా సవ్యంగానే సాగింది. ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు నవిష్క. కళ్యాణ్ దేవ్ కూడా చిరంజీవి ఇంట్లోనే ఉండేవాడని సమాచారం. 
 

48
Sreeja Kalyan

ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. కళ్యాణ్ దేవ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు పరోక్షంగా ఇద్దరికీ సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఒకరికి తగిలేలా మరొకరు పోస్ట్స్ పెడుతూ ఉంటారు. కూతురు నవిష్క శ్రీజ వద్దే ఉంటుంది. అప్పుడప్పుడు తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు వస్తుంది.

58

శ్రీజ-కళ్యాణ్ దేవ్ అధికారికంగా విడాకులు ప్రకటించలేదు. చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. రెండో భర్తకు కూడా దూరమైన శ్రీజ మీద యాంటీ ఫ్యాన్స్ తరచుగా నెగిటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియా దాడి చేస్తుంటారు. తాజాగా నవిష్క 5వ బర్త్ డే జరిగింది. దీంతో కూతురికి ఆమె ఇంస్టాగ్రామ్ వేదిక బర్త్ డే విషెస్ తెలియజేసింది.

68
Sreeja Konidela

'మై లిటిల్ కుకీ టర్న్ 5, హ్యాపీ బర్త్ డే 5' అని శ్రీజ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ పై స్పందించిన అభిమానులు నవిష్కకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. యాంటీ ఫ్యాన్ మాత్రం ట్రోల్ చేశాడు. ''ఎన్నో భర్త కూతురు?'' అని ఒకరు కామెంట్ పోస్ట్ చేయగా... మరొక నెగిటివ్ దారుణమైన డబుల్ మీనింగ్ కామెంట్ చేశాడు. 
 

78
Sreeja Konidela

కూతురు పుట్టినరోజు నాడు కూడా శ్రీజను బాధ పెట్టేలా ఆ కామెంట్స్ ఉన్నాయి. కాగా చదువుకునే రోజుల్లో శ్రీజ క్లాస్ మేట్ ని పేరెంట్స్ కి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో ఇది నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. కుటుంబ సభ్యుల నుండి హాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఆమె ఆరోపణలు చేశారు. 

 

88
Sreeja

మొదటి భర్తతో శ్రీజకు ఒక కూతురు. కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. కొంత కాలం సింగిల్ గా ఉన్న శ్రీజ కళ్యాణ్ దేవ్ ని ప్రేమించారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అప్పుడప్పుడు శ్రీజకు మూడో పెళ్లి అంటూ ఊహాగానాలు తెరపైకి వస్తూ ఉంటాయి... 
 

Read more Photos on
click me!

Recommended Stories