ఇలాంటి సీఎంలను చాలా చూశా.. ఎన్టీఆర్ ని అందుకే దూరం పెట్టా.. రామారావుపై ఏఎన్నార్‌ సంచలన వ్యాఖ్యలు

Published : Apr 22, 2024, 01:38 PM ISTUpdated : Apr 22, 2024, 03:45 PM IST

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌.. తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలాంటి వాళ్లు అంటుంటారు. కానీ ఆ ఇద్దరి మధ్య గొడవలున్నాయి. తాజాగా ఏఎన్నార్‌ ఇంటర్వ్యూ వైరల్‌ అవుతుంది.   

PREV
17
ఇలాంటి సీఎంలను చాలా చూశా.. ఎన్టీఆర్ ని అందుకే దూరం పెట్టా.. రామారావుపై ఏఎన్నార్‌ సంచలన వ్యాఖ్యలు
pawan kalyan

పవన్‌ కళ్యాణ్‌.. ఇటీవల ఏపీ సీఎంపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌పై వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు చేశారు, మాట్లాడారు. కానీ ఏనాడూ ఎన్టీఆర్‌.. కృష్ణ తీసిన సినిమాలను ఆపలేదని వ్యాఖ్యానించ్చారు. వైఎస్‌ జగన్‌ మాత్రం తమ సినిమాలను ఆపుతున్నాడని తనదైన స్టయిల్‌లో విమర్శలు చేశారు పవన్‌. ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. 

27

ఎన్టీఆర్‌తో విభేదాలకు సంబంధించి కృష్ణ మాట్లాడిన ఇంటర్వ్యూ క్లిప్పులు ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఏఎన్నార్‌ చేసిన కామెంట్లని వైరల్‌గా మారుస్తున్నారు. ఎన్టీఆర్‌ ఎంత చేసినా తాము తప్పుగా మాట్లాడలేదని ఏఎన్నార్‌ అంటే, తాను ఎన్ని సినిమాలు చేసినా ఏ మూవీని ఆపలేదని, పైగా కలిసినప్పుడు `ఏం బ్రదర్‌` అంటూ పలకరించేవారని కృష్ణ చెప్పారు. 
 

37

అయితే ఇందులో ఏఎన్నార్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చకి కారణమవుతుంది. ఎన్టీఆర్‌ కావాలనే తన స్టూడియో మీదకు వచ్చినట్టుగా ఆయన తెలిపారు. తన స్టూడియో మీదకు వచ్చిప్పట్నుంచి తాను ఎన్టీఆర్‌ని దూరం పెట్టినట్టు తెలిపారు. ఆ తర్వాత పలు మార్లు తనని ఆహ్వానించినా వెళ్లలేదు. సీఎం అయితేనే ఐ డోంట్‌ కేర్‌ అనుకున్నా. ఎక్కడైనా కలిస్తే ఏం బ్రదర్‌ ఎలా ఉన్నారు, మరదలు గారు ఎలా ఉన్నారు, నాగార్జున ఎలా ఉన్నారని అడిగేవాడు. సీఎం కదా అంత అది ఎన్టీఆర్‌ సంస్కారం అనికుంటారని అలా అడిగేవాడు. 
 

47

కానీ నేను మాత్రం వెళ్లేవాడిని కాదు. సీఎం అయితేనేం ఇలాంటి సీఎంలను చాలా మందిని చూశాను. నేను కూడా చాలా మందిని చూశాను. నాకు అందరి రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయి. క్లోజ్‌గా ఉండేవాడిని. నాకు పొలిటీషియన్లతో ఉన్న టచ్‌ ఎవరికీ లేదు. అందు చేత నేను ఎందుకు విమర్శిస్తాను, నాకు అవసరం ఏముంది. నేను రాజకీయాలు వద్దన్నవాడిని అనేవిషయాన్ని ఏఎన్టీఆర్‌ ఆలోచించలేకపోయాడు. 
 

57

మళ్లీ రెండో సారి సీఎం అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచారు. ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నాను, అందరు వచ్చి రమ్మన్నారు. సీఎం రమ్మంటున్నారని చెప్పారు. అయినా నేను రానని చెప్పా. ఆయనపై కోపంగా ఉన్నానని చెప్పమని చెప్పా. ఆ విషయాన్ని పెద్దలు చెబితే బ్రదర్‌కి ఎందుకో నాపై కోసం, ఏదైనా రాంగ్‌ మాట్లాడి ఉంటే సారీ అని చెప్పాడు. ఆ తర్వాత మేం కలిసిపోయాం` అని తెలిపారు ఏఎన్నార్‌. 

67

ఇక స్టూడియో గొడవ కోర్టులో తేల్చుకున్నామని, ఆ సమయంలోనే చెన్నారెడ్డి సీఎంగా వచ్చాడు, ఆయన వద్దకు ఈ ఇష్యూ వస్తే, ఏం చేయమంటారు అని అడిగారు, మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయాలని చెప్పాను, ఆయన ఈ కేసుని క్లోజ్‌ చేశారు.

77

కానీ ఎన్టీఆరే ఉండి ఉంటే, ఇష్యూ సుప్రీం కోర్ట్ వరకు వెళ్లేది అని వెల్లడించారు ఏఎన్నార్. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కేతో కొన్నేళ్ల క్రితం మాట్లాడిన ఈ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం. పవన్‌ కామెంట్ల నేపథ్యంలో వైసీపీ అభిమానులు ఏఎన్నార్‌ కామెంట్స్ ని వైరల్‌ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories