తన గత లవ్‌స్టోరీ చెప్పి షాకిచ్చిన అంకిత.. తనకంటే 26ఏళ్లు పెద్దైన మిలింద్‌ని చేసుకోవడంపై వివరణ

Published : Jun 11, 2021, 09:45 AM IST

బాలీవుడ్‌ మోడల్‌, నటుడు మిలింద్‌ సోమన్‌ని పెళ్లి చేసుకోవడంపై, తన గత ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీని రివీల్‌ చేసింది అంకిత కొన్వర్‌. తనకంటే 26ఏళ్లు పెద్దైన మిలింద్‌తో ప్రేమ కథని వెల్లడించింది. 

PREV
17
తన గత లవ్‌స్టోరీ చెప్పి షాకిచ్చిన అంకిత.. తనకంటే 26ఏళ్లు పెద్దైన మిలింద్‌ని చేసుకోవడంపై వివరణ
బాలీవుడ్‌లో నటుడిగా, మోడల్‌గా రాణిస్తున్న మిలింద్‌ సోమన్‌ పలు న్యూడ్‌ ఫోటో షూట్లతో సంచలనం క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే.52ఏళ్ల మిలింద్‌ తనకంటే సగం ఏజ్‌ అయిన అంటే 26ఏళ్ల అంకిత కొన్వర్‌ ప్రేమలో పడ్డాడు. ఇది అప్పట్లో సంచలనంగానూ మారింది.

27
అయితే దీనిపై తాజాగా అంకిత స్పందించింది. వృద్ధుడిని పెళ్లి చేసుకోకూడదు అన్న భారతీయుల మూస ఆలోచనా ధోరణిని ఎలా ఎదుర్కొన్నారు? అని నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది.

37
`సమాజంలో జరిగే అసాధారణ విషయాల గురించి మాట్లాడేందుకు ప్రజలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అది ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచం అంతటా ఉంది. మనందరిలో నైపుణ్యాలు ఉంటాయి. కానీ దానివల్ల మంచి, చెడుకు మధ్య వ్యత్యాసం తెలుసుకోగలిగేంత స్పృహ ఉండదు. నేను మాత్రం నాకెప్పుడూ సంతోషాన్నిచ్చే పనులే చేశాన`ని తెలిపింది. మిలింద్‌ని మ్యారేజ్‌ చేసుకోవడాన్ని ఇలా సమర్ధించుకుంది అంకిత.

47
`మిలిండ్‌ పరిచయం కావడానికి ముందు నాకో బాయ్‌ ఫ్రెండ్‌ ఉండేవాడు. అతను సడెన్‌గా చనిపోవడంతో ఎంతో కుంగిపోయాను. ఆ సమయంలో ఉద్యోగరీత్యా చెన్నైకి రావాల్సి వచ్చింది. అక్కడ ఓ హోటల్‌లో బస చేస్తున్నసమయంలో మిలింద్‌ కలిశాడ`ని తెలిపింది.

57
మిలింద్‌కి అంకిత పెద్ద అభిమాని. అయితే ఆ హోటల్‌కి వచ్చినప్పుడు మొదటిసారి ఆయన్ని కలిసేందుకు వెళ్లగా మిలింద్‌ బిజీగా ఉండి పట్టించుకోలేదట. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే హోటల్‌కి మిలింద్‌ రావడంతో ఈ సారి ఎలాగైనా కలవాలని నిర్ణయించుకుంది. అంతే ఆమెని చూసిన తొలిచూపులతోనే పడిపోయాడట మిలింద్‌.

67
ఫ్రెండ్స్‌ ఎంకరేజ్‌మెంట్‌తో అతడితో కలిసి డ్యాన్స్‌ చేసింది అంకిత. అక్కడ వారి ప్రేమ బలపడింది. ఒకరోజు తన గతాన్నంతా మిలింద్‌కు చెప్పింది అంకిత. `ఏ క్షణమైతే నీతో ప్రేమలో పడ్డానో, అప్పుడే నీకు సంబంధించిన ఏ విషయాన్నైనా స్వాగతిస్తాను అని ఫిక్సయ్యా. నీ గత జ్ఞాపకాల భారాన్ని నేనూ మోస్తాను. మనం కలిసే ఉందాం` అని ఆమె చేయి పెట్టుకున్నాడు మిలింద్‌.

77
అలా 2018లో వీరి వివాహం జరిగింది. అప్పుడు మిలింద్‌ వయసు 52 కాగా అంకిత వయసు 26 ఏళ్లు మాత్రమే. అంటే కరెక్ట్ గా సగం ఏజ్‌. ప్రేమకు వయసు అక్కర్లేదని మనసులు కలిస్తే చాలని పెళ్లి చేసుకుని నిరూపించారు వీరిద్దరు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories