నందమూరి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగే న్యూస్... బాలయ్య డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్

First Published Jun 10, 2021, 9:24 PM IST

నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ... ఏళ్లుగా నడుస్తున్న ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. మోక్షజ్ఞ టీనేజ్ కి వచ్చినప్పటి నుండే బాలయ్య ఫ్యాన్స్ లో ఈ డిమాండ్ ఉంది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 

మోక్షజ్ఞ వయసు ప్రస్తుతం 25ఏళ్ళు పైమాటే అయినా ఆయన ఎప్పుడు హీరోగా సినిమా చేస్తారో అర్థం కాని పరిస్థితి. మోక్షజ్ఞ ప్రతి బర్త్ డే గ్రాండ్ గా నిర్వహించే నందమూరి అభిమానులకు ఇది తీవ్ర నిరాశకు గురిచేస్తున్న అంశం.
undefined
మోక్షజ్ఞకు అసలు హీరో కావాలనే ఆసక్తి లేదనేది కొన్నాళ్లుగా వినిపిస్తున్న వాదన. ఈవార్తలను నిజం చేసేదిగా మోక్షజ్ఞ ప్రవర్తన ఉంది. ఆయన హీరోకి కావాల్సిన పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేయరు. ఆ మధ్య బయటికి వచ్చిన ఓ ఫ్యామిలీ పిక్ లో పెద్ద పొట్టతో మోక్షజ్ఞ షేప్ అవుట్ బాడీతో కనిపించారు.
undefined
కాగా నేడు బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ హీరోగా మారడానికి రంగం సిద్ధం అవుతుంది అన్నారు. అనూహ్యంగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ తన దర్శకత్వంలోనే ఉంటుందని ఆయన చెప్పడం విశేషం.
undefined
గతంలో బాలకృష్ణ డైరెక్షన్ చేసిన అనుభవం లేదు. నర్తనశాల అనే ఓ పౌరాణిక చిత్రాన్ని మొదలుపెట్టి సౌందర్య మరణంతో మధ్యలో వదిలివేశారు. మరి అలాంటి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని చెప్పడం సంచలనంగా మారింది.
undefined
మోక్షజ్ఞ డెబ్యూ చిత్రానికి దర్శకులు వీరే అంటూ గతంలో రాజమౌళి, పూరి జగన్నాధ్, బోయపాటి, అనిల్ రావిపూడి వంటి టాప్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి.
undefined
ఇక ప్రతి పుట్టినరోజుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చెబుతున్నారు. ఐతే అది కార్యరూపం దాల్చడం లేదు. ఈ సారైనా ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట బాలయ్య నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.
undefined
click me!