Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్

Published : May 17, 2026, 08:30 PM IST

వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోయిన్ కి చాలా లాంగ్ కెరీర్ ఉంటుంది. కానీ ఓ హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె కెరీర్ త్వరగా ముగిసింది. 

PREV
15
అంజలా జవేరి

హీరోయిన్లకు ఒక్క ఫ్లాప్ పడితే చాలు కెరీర్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్ల కెరీర్ కూడా ముగిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ హీరోయిన్ ఎవరో కాదు అంజలా జవేరి. ఆమె టాలీవుడ్ లోకి ప్రేమించుకుందాం రా చిత్రంతో అడుగుపెట్టింది.

25
ప్రేమించుకుందాం రా మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ

వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా మూవీ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత కూడా అంజలా జవేరికి అద్భుతమైన చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ప్రేమించుకుందాం రా తర్వాత అంజలా జవేరి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ కొట్టేసింది. వీరి కాంబోలో వచ్చిన చూడాలని ఉంది మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

35
వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు

వెంటనే బాలయ్య సరసన సమరసింహా రెడ్డి చిత్రంలో నటించింది. అది కూడా ఇండస్ట్రీ హిట్టే. దీనితో ఒక్కసారిగా టాలీవుడ్ లో అంజలా జవేరికి క్రేజ్ పెరిగిపోయింది. కానీ బ్యాడ్ టైం కూడా అప్పుడే ప్రారంభం అయింది.

45
ఫ్లాపులు మొదలు

రెండు మూడు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత అంజలా జవేరి నాగార్జున రావోయి చందమామ చిత్రంలో నటించింది. ఈ మూవీతోనే ఫ్లాపులు మొదలయ్యాయి. రావోయి చందమామ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత వెంకటేష్ తో నటించిన దేవి పుత్రుడు పర్వాలేదనిపించింది కానీ పూర్తిగా అంచనాలు అందుకోలేదు.

55
బాలయ్య సినిమాతో కెరీర్ క్లోజ్

సమరసింహా రెడ్డి తర్వాత మరోసారి బాలయ్యకి జోడీగా బలేవాడివి బాసూ చిత్రంలో అంజలా జవేరి నటించింది. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ చిత్రంతోనే అంజలా జవేరి టాలీవుడ్ కెరీర్ కి ఎండ్ కార్డు పడింది. ఆ తర్వాత ఆమెకి హీరోయిన్ గా ఛాన్సులు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో క్యారెక్టర్ రోల్ లో నటించింది. ఆ సినిమా కూడా ఫ్లాపే. అంజలా జవేరి నటుడు తరుణ్ అరోరాని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అతడు అనేక చిత్రాల్లో విలన్ గా నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories